Money Wrong Transaction: సాధారణంగా మనం మన అకౌంట్ నుంచి ఇతర అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల ఆ డబ్బులు పంపించవలసిన అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ కి జమవుతాయి.ఇలా వేరే అకౌంట్ కి జమ అయిన సమయంలో కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
ఇలా డబ్బులు వేరే అకౌంట్ లోకి పడినప్పుడు ఏ మాత్రం కంగారు పడకుండా వెంటనే సంబంధిత బ్యాంకు మేనేజర్లను సంప్రదించి అసలు విషయం తెలియజేయాలి.
Also Read: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.. ఒక్కొక్కరికి ఏకంగా రూ.6 లక్షలు!
మీరు డబ్బులను ఏవిధంగా వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఎలా చేశారు అనే విషయాలను సంబంధిత బ్యాంకు మేనేజర్ కు వివరించాలి. కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసి సంబంధిత వివరాలు అన్నింటిని తెలియజేయాలి. మీరు పంపిన డబ్బులు వేరే అకౌంట్ లో పడిన రెండు ఒకే బ్యాంకు అయితే ఈ మాత్రం కంగారు పడాల్సిన పనిలేదు. వెంటనే సంబంధిత బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి అతనికి అసలు విషయం తెలియజేసి మీ వివరాలన్నింటినీ సంప్రదిస్తే రెండు మూడు రోజులలో ఆ డబ్బులు తిరిగి అకౌంట్ లో చేరుతాయి.
ఇతర బ్యాంకుకు సంబంధించి అకౌంట్ లో డబ్బులు పడితే ఆ డబ్బు కోసం కొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.ఇతర బ్యాంకు డబ్బులు పంపినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్ ని కలిసి మీరు ఎవరికైతే పొరపాటున డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారోవారి డీటెయిల్స్ వారికి అందించాలి. ఇలా ఆ డబ్బులు తిరిగి మీ అకౌంట్లో పడటానికి సుమారు రెండు నెలల సమయం పడుతుంది. ఒకవేళ డబ్బులు తిరిగి ఇవ్వని పక్షంలో మీరు సరాసరి కోర్టును ఆశ్రయించి మీ సమస్యకు పరిష్కారం వెతకవచ్చు.
Also Read: హై బీపీతో బాధ పడుతున్నారా.. ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు ఇవే?