Emergency Loans: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ పాలసీలలో ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఒకటి కాగా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యం పాలైనా ఈ పాలసీ సహాయంతో సులువుగా డబ్బులు పొందవచ్చు. అయితే అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ఎల్ఐసీ ద్వారా సులభంగా రుణాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఎల్ఐసీ 6 నెలల్లో చెల్లించే మొత్తానికి ప్రస్తుతం 9 శాతం వడ్డీ తీసుకుంటోందని సమాచారం అందుతోంది. పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై 90 శాతం వరకు రుణం తీసుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తోంది. గరిష్టంగా 50 కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పాలసీపై రుణం తీసుకోవచ్చు. మూడేళ్లు పాటు ప్రీమియాలు చెల్లించిన వాళ్లు మాత్రమే ఈ రుణాలు పొందడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
లోన్ తీసుకున్న వాళ్లు లోన్ ను తిరిగి చెల్లించడంలో విఫలమైతే మాత్రం ఆ మొత్తాన్ని లోన్ మొత్తం నుంచి తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ అథారిటీలు సైతం ఈ రుణం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోరని సమాచారం అందుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల చేతిలో పాలసీకి సంబంధించిన అన్ని హక్కులు ఉంటాయని గుర్తుంచుకోవాలి.