Saving Account Limit: నేడు డిజిటల్ మనీ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే చాయ్ తాగినా రూ. 10 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. డిజిటల్ మనీ అంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జన్ ధన్ ఖాతాలు తెరిపించడంతో దాదాపు గ్రామీణులకు కూడా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. దీంతో డిజిటల్ మనీ వినియోగం ఈ పదేళ్లలో గరిష్టంగా పెరిగింది.
ఈ లావాదేవీలన్నీ బ్యాంక్ ఖాతా నుంచే జరపాలి. ఆ బ్యాంకు ఖాతా రకాన్ని (సేవింగ్స్, కరెంట్) బట్టి ట్రాన్జక్షన్ ఉంటుంది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నాయి. మరి బ్యాంకు ఖాతాలో (సేవింగ్స్) ఎంత వరకు డబ్బు ఉండవచ్చు అనే అనుమానం ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. అసలు అందులో ఎంత డిపాజిట్ చేయవచ్చు? పరిమితి ఎంత? తెలుసుకుందాం..
మన సేవింగ్స్ ఖాతాలో రూ. 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదాయానికి సంబంధించి వివరాలు అడుగుతుంది. మీరిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఒక వేళ సరైన పత్రాలు చూపకపోతే 60 శాతం సొమ్ము జరిమానా కింద వసూలు చేస్తుంది.
సేవింగ్స్ ఖాతాలో సొమ్ము పొదుపు చేసేందుకు బ్యాంకులు ఎలాంటి పరిమితి విధించలేదు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆ డబ్బుకు సంబంధించి వివరాలను సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు తప్పకుండా తెలియజేయాలి.
సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ముకు సంబంధించి ఆదాయపు పన్ను పరిధిలోకి, సమాచారం ఆదాయపు పన్ను శాఖకు తప్పుకుండా ఇవ్వాల్సిందే. ఆదాయ వనరుల వివరాలను కూడా శాఖకు తెలియజేయాలి.
దేశంలో దాదాపు 80 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. యూపీఐ రాకతో మార్కెట్లో డిజిటల్ మనీ పెరిగింది. ముఖ్యంగా చిల్లర సమస్యకు అతిపెద్ద పరిష్కారం దొరికిందనే చెప్పాలి.
సేవింగ్స్ ఖాతాలో ఎక్కువ సొమ్ము ఉంచడం మంచిది కాదని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తున్నారు. ఒక వేళ డబ్బు సురక్షిత మార్గాల్లో ఉంచాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.