Honda Activa Vs Suzuki Access: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారు విద్యుత్ వేరియంట్ ను ఎక్కువగా ఎంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం పోటీపడి కొత్త కొత్త విద్యుత్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. మొదట్లో OLA, BAJAJ వంటి కంపెనీలు విద్యుత్ స్కూటర్లను పరిచయం చేశాయి. ఇప్పుడు వీటికి పోటీగా హోండా యాక్టివా, సుజుకి ఈ- యాక్సెస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. వీటి రాకతో ప్రముఖ సంస్థ అయిన ఓలా కంపెనీపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే హోండా, సుజుకి వాహనాల మధ్య తేడా ఏంటి..? ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఎలా ఉన్నాయి..? ఒకసారి పరిశీలిద్దాం..
మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు రావడంతో చాలామంది పెట్రోల్ వాహనాల స్థానంలో వాటిని చేర్చుకుంటున్నారు. ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో పాటు మైలేజ్ కూడా ఎక్కువగా ఇవ్వడంతో వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ కంపెనీయులైన హోండా.. యాక్టివా స్కూటర్ తో ఇప్పటికే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ- బైకును ప్రవేశపెట్టడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు సుజుకి సైతం e-యాక్సెస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో దాని గురించి చర్చించుకుంటున్నారు.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో 1.5 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 102 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. సుజికి ఈ యాక్సెస్ వాహనంలో 3.07 కిలో వాట్ బ్యాటరీ తో ఫుల్ చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. రెండు వాహనాల విషయానికొస్తే యాక్టివా దూసుకుపోతుందని చెప్పొచ్చు. అయితే యాక్టివా హోమ్ చార్జింగ్ సదుపాయం అందుబాటులో లేదు. దీనిని ఇతర స్టేషన్లోకి వెళ్లి చార్జింగ్ పెట్టుకోవాలి. యాక్సెస్ స్కూటర్ మాత్రం ఇంటి వద్ద కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు .
హోండా యాక్టివా స్కూటర్లో ఎల్ఈడి లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ కి ఫీచర్లు ఉన్నాయి. సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా దీనికి అనుసంధానం చేశారు. సుజికి ఈ- యాక్సెస్ స్కూటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్, ఎస్ఎంఎస్ అలర్ట్ , యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. దీనికి కూడా సైడ్ స్టాండ్ అలర్టు తో పాటు స్మార్ట్ కి ఆప్షన్ ఇచ్చారు.
హోండా యాక్టివా మార్కెట్లో రూ 1.7 లక్షల ప్రారంభ ధరలతో విక్రయిస్తున్నారు. ఇందులో రోడ్ సింక్ డియో తో రూ 1.52 లక్షలు గా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. అదే సుజికి యాక్సెస్ స్కూటర్ ధర 1.17 లక్షలు ఉంటుందని అంటున్నారు. దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు
అయితే ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలలో ఓలా సంస్థ ఆధిపత్యం చలాయిస్తోంది. కానీ ఇప్పుడు హోండా తో పాటు సుజికి వాహనాలు మార్కెట్లోకి రావడంతో ఆ సంస్థను బీట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఓలా సంస్థ రూ లక్ష లోపే వాహనాన్ని అందిస్తుంది. అయితే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.