https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారా..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు పీఎఫ్ సేవలను అందిస్తుండగా ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్‌ లో జమవుతుందనే సంగతి తెలిసిందే. అయితే మనలో చాలామంది తరచూ వేర్వేరు కారణాల వల్ల ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఉద్యోగం మారిన సమయంలో కొంతమంది ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకుంటె […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 1, 2021 / 03:48 PM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు పీఎఫ్ సేవలను అందిస్తుండగా ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్‌ లో జమవుతుందనే సంగతి తెలిసిందే. అయితే మనలో చాలామంది తరచూ వేర్వేరు కారణాల వల్ల ఉద్యోగాలు మారుతూ ఉంటారు.

    ఉద్యోగం మారిన సమయంలో కొంతమంది ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకుంటె మరి కొందరు ఉద్యోగులు మాత్రం కొత్త కంపెనీకి పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు పీఎఫ్ ఖాతా విషయం నిర్లక్ష్యం వహిస్తారు. అయితే ఉద్యోగం మారిన సమయంలో కొత్త పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఉంటే పీఎఫ్ డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మంచిది. పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.

    పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోని పక్షంలో ఈపీఎఫ్ డబ్బులపై వడ్డీ వస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలలోని నగదుపై 8.5 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ కావడం ఆగిపోతే పొందిన వడ్డీ మొత్తంపై పన్ను భారం పడే అవకాశాలు ఉంటాయి. రిటైర్మెంట్ సమయంలో మీరు పొందే డబ్బులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి.

    అందువల్ల పీఎఫ్ అకౌంట్‌ ను కలిగి ఉన్నవాళ్లు డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకుంటే మంచిది. పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన విషయాలపై కచ్చితంగా అవగాహనను కలిగి ఉండాలి. అవగాహన లేకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు.