Best Car: కరోనా తరువాత చాలా మంది కారును కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఫ్యామిలీతో కలిసి ఇతర వాహనాల్లో వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. దీంతో సొంత వెహకల్ ఉంటే ఎంత దూరమైనా, ఎప్పుడైనా ప్రయాణించవచ్చనే ఆలోచనతో కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ టూర్ కు అనువైన కారు ఏది? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకు అవసరమయ్యే విధంగా కొన్ని కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ కార్ల వివరాలేవో చూద్దాం..
ఫ్యామిలీ టూర్ కు అనువైన కారుగా నిలుస్తోంది హ్యుందాయ్ క్రెటా N లైన్. ఇది 5 సీటర్ కారు. ఆటోమేటిక్ గేర్ టెక్నాలజీతో పనిచేసే ఇందులో 10.25 అంగుళాల హెచ్ డీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ ప్లేను కలిగి ఉంది. అలాగే సేఫేస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో డ్రైవర్ సీటును 8 రకాలుగా అడ్జెస్ట్ మెంట్ చేసుకునే సదుపాయాలు ఉన్నాయి. దీనిని రూ.16.82 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.20.45 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ క్రెటా N లైన్ సేఫ్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది.
స్కోడా కంపెనీకి చెందిన మోడళ్లలో ఫ్యామిలీ టూర్ కు వెళ్లేందుకు అనుగుణంగా ఉండే కార్లు ఉన్నాయి. ఇందులో స్కోడా కు చెందిన కుషాక్ ది బెస్ట్ కారుగా నిలుస్తుంది. ఇందులో 25.4 సెంటిమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి వెగా సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులో స్పెషల్ గా సన్ రూఫ్ పీచర్ కూడా ఉంది. దీనిని రూ.10.89 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.18.79 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
వీటితో పాటు టటా కంపెనీకి చెందిన హారియర్ సైతం కుటుంబ సభ్యుల ప్రయాణానికి అనుగుణంగా ఉంది. ఇది 5 సీటర్ కారు. మార్కెట్లో మొత్తం 25 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 7 ఎయిర్ బ్యాగులు, ADAS, అధునాతన ఫీచర్స్ కలిగిన ఇందులో వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్ రూఫ్ పీచర్ ఉంది. ద్వి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కారుకు మెరుగైన రూపాన్ని అందిస్తుంది. దీనిని రూ.15.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.