SUV Car: ప్రస్తుత కాలంలో చాల మంది SUV కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే వీటి డిజైన్ తో పాటు ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అందువల్ల ఎస్ యూవీ కార్లు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీలను తయారు చేస్తుంటాయి. వీటిలో టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఉన్నాయి. అయితే వీటికి హ్యుందాయ్ కంపెనీ ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకువస్తూ గట్టి పోటీ ఇస్తోంది. హ్యుందాయ్ ఎస్ వీల్లో Exter గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎస్ యూవీ కార్లు కొనుగోలు చేయాలని వినియోగదారులు భావిస్తున్నా లో బడ్జెట్ కార్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరికి అనుగుణంగా హ్యుందాయ్ కంపెనీ తక్కువ ధరకే ఎక్స్ టర్ ను అందిస్తోంది. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఎక్స్ టర్.. వచ్చీ రాగానే అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంది. ఇందుకు కారణం ఈ కారు మిగతా ఎస్ యూవీ కార్లకు గట్టి పోటీ ఇస్తూనే.. లో బడ్జెట్ లో అందుబాటులో ఉంది. సాధరణంగా ధర తక్కువ అనగానే ఫీచర్స్ విషయంలో అనుమాన పడుతూ ఉంటారు. కానీ ఎక్స్ టర్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్స్ ను అందిస్తుంది.. అంతేకాకుండా ఇది ఇప్పటి వరకు ఉన్న టాటా పంచ్ ఎస్ యూవీకి ప్రత్యామ్నంగా ఉండడంతో ఎక్స్ టర్ ను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హ్యుందాయ్ ఎక్స్ టర్ ఎస్ యూవీలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ఎందుకు దీనికంత డిమాండ్?
హ్యుందాయ్ ఎక్స్ టర్ గత ఏడాది మార్కెట్లోకి వచ్చింది. ఇది రిలీజ్ అయిన ఏడాదిలో లక్ష యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. మిగతా కార్ల కంటే ఇందులో ఉండే ఫీచర్స్ బాగా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. హ్యాందాయ్ ఎక్స్ టర్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 67 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిసన్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్న ఈ మోడల్ మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఎక్స్ టర్ ఫీచర్స్ అద్భుతం అని అంటున్నారు. డిజిటల్ డిస్ ప్లే, 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అలెక్సా హోమ్ టు కార్ కనెక్టివిటీ ఇందులో కనిపిస్తుంది. వైర్ లెస్ ఛార్జర్ తో పాటు యూఎస్ బీ స్లాట్, డ్రైవర్ కు అనుగుణంగా క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేప్టీ ఫీచర్స్ లోనూ ఎక్స్ టర్ తగ్గేదేలే అంటోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, డ్యూయెల్ కెమెరా డ్యాష్ కామ్ అందుబాటులో ఉన్నాయి. లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన 3 పాయింట్ సీట్ బెల్ట్ లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో చైల్డ్ సీట్ యోసం ఐసోఫిక్స్ మౌంట్ లను అమర్చారు.
లో బడ్జెట్ లో ఎస్ యూవీ కారు కొనాలనుకునేవారు ఎక్స్ టర్ ను ఎంపిక చేసుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మోడల్ బేస్ వేరియంట్ ను రూ.6.13 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అత్యధికంగా రూ.10.43 లక్షల ధర పలుకుతోంది. ఇప్పటికే మార్కెట్లో మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్ ఎస్ యూవీలు ఆదరణ పొందుతుండగా వాటికి హ్యుందాయ్ ఎక్స్ టర్ గట్టి పోటీ ఇస్తోంది. అందుకే ఇది ఒక్క ఏడాదిలో 93 వేల యూనిట్ల విక్రయాలు జరుపుకుంది.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More