Car Loan: సాధారణంగా కారును కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో సెకండ్ హ్యాండ్ కారు కొనాలన్నా లక్షలు ఖర్చు చేయాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హ్యాండ్ కార్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. గతేడాది సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విలువ 27 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ప్రముఖ సంస్థలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
కార్స్24 సంస్థతో బజాజ్ ఫైనాన్స్ ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. అర్హత, రుణం, కాలపరిమితి, వడ్డీ రేట్లు, ఈఎంఐ ఈ వివరాలను బట్టి సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సెకండ్ హ్యాండ్ కార్లపై తీసుకున్న రుణాలను మూడు నుంచి ఐదేళ్ల లోపు తిరిగి చెల్లించాలి.
సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సమయంలో అప్పటికే రుణాలు ఉన్న కార్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ప్రస్తుతం బైక్ వాడుతూ కొత్త కారును కొనుగోలు చేసే స్తోమత లేని వాళ్లు సెకండ్ హ్యాండ్ కార్లపై ఆసక్తి చూపితే మంచిది. వ్యాపారులు సైతం దగ్గరి ప్రయాణాల కోసం సెకండ్ హ్యాండ్ కార్లను వినియోగిస్తే మంచిది. అయితే ఎక్కువ సంవత్సరాలు కారు వాడాలని అనుకునేవాళ్లు పాతకార్లకు దూరంగా ఉంటే మంచిది.
కార్లను వాడే విధానం, కార్ల పనితీరును బట్టి కారు ధరలలో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. కారును జాగ్రత్తగా చూసుకుంటే ఆ కారు మంచి రేటు పలికే అవకాశం ఉంటుంది. కారు రూపురేఖలు మారితే మాత్రం ఆ కారు తక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశాలు ఉంటాయి.