Wagon R Electric Car: Maruti Suzuki నుంచి ఏ కారు మార్కెట్లోకి వచ్చినా వెంటనే దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. దశాబ్దాల కిందట ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొన్ని కార్లు ఇప్పటికీ సేల్ అవుతున్నాయి అంటే వాటి ప్రాముఖ్యత ఏందో తెలుసుకోవచ్చు. అలా 1999 లో మార్కెట్లోకి వచ్చిన Wagon R కారును ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మోడల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ కారుకు పోటీగా ఎన్నో మోడల్స్ వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు వెళుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వ్యాగన్ఆర్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా రాబోతుంది. 2026 సంవత్సరంలో ముందుగా అప్డేట్ అయిన పెట్రోల్/CNG కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చి ఆ తర్వాత EV కార్లను వినియోగదారులకు అందించే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ కొత్త కార్లు ఎలా ఉండబోతున్నాయంటే?
కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభివృద్ధిలో మారిపోతున్నాయి. ఇందుకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ కార్లను అప్డేట్ చేస్తున్నాయి. మారుతి సుజుకి కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చినప్పటికీ వినియోగదారుల ను ఆకట్టుకునేందుకు లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తోంది. 2026 లో కొత్తగా రాబోయే కార్లలో కొన్ని అదనపు ఫీచర్లను చేకూర్చనుంది. ఈ కార్లలో LED హెడ్ లాంప్స్ అప్డేట్ కాలున్నాయి. కొత్త గ్రిల్ తో పాటు అల్లాయి వీల్ డిజైన్స్ మారనున్నాయి. సుమారు 3655 ఎంఎం పొడవు, 1620 ఎమ్ ఎమ్ వెడల్పు తో కొత్త కారు ఉండనుంది. అంటే గతంలో కంటే ఇప్పుడు మరింతగా విశాలమైన క్యాబిన్ ఉండే అవకాశం ఉంది.
ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లు కూడా మారనున్నాయి. నేటి వినియోగదారులకు అనుగుణంగా ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో కూడిన 9 అంగుళాల టచ్ స్క్రీన్, సెమీ డిజిటల్ క్లస్టర్, మెరుగైన డాష్ బోర్డు ఉండే అవకాశం ఉంది. ఏసీ వేరియంట్, హూ ఇస్ కంట్రోల్ తో పాటు హెడ్ రూమ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండనుంది. ఒకవేళ EV కారు వస్తే అందులో బ్రేకింగ్ ఫీడ్ బ్యాక్ ను, ఫ్రీ కూలింగ్ కోసం యాప్ కనెక్టివిటీ చేసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటివరకు ఉన్న వ్యాగన్ఆర్ 33 కంటే ఎక్కువగా కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నాయి. అయితే 2026 లో వచ్చే కార్లు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువగా పెట్రోల్ ఇంధనంపై మైలేజ్ ఇవ్వనున్నాయి. CNG వేరియంట్ లో మరింతగా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. అయితే EV కారులో 30 నుంచి 40 కిలోవాట్ బ్యాటరీ చేర్చనున్నారు. ఇది 250 నుంచి 300 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కార్లలో EBD తోపాటు ABS టెక్నాలజీని అమర్చనున్నారు. 2026 మధ్యలో పెట్రోల్/CNG కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది రూ.5 లక్షల ప్రారంభ ధరతో ఉండే అవకాశం ఉంది. 2027 లో EV కారును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని రూ.8 నుంచి 12 లక్షల వరకు ధర నిర్ణయించే అవకాశం ఉంది.