Cars: దీపావళి పండుగ సందర్భంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు వస్తుంటాయి. ఆటోమోబైల్ రంగంలోని ఈ సందడి నెలకొంటుంది. దీపావళికి కార్లు కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. రూ.30 వేల నుంచి లక్ష వరకు తగ్గింపు ధరను ప్రకటిస్తాయి. కానీ ఓ కంపెనీ మాత్రం ఏకంగా రూ.7 లక్షల వరకు తగ్గింపు చేసింది. ఇంతలా తగ్గింపు చేసిన ఆ కారు ధరఎంత? కంపెనీ ఎంత ప్రకటించింది? అనే వివరాలు తెలుసుకునేందుకు కిందికి వెళ్లండి..
భారీ వాహనాలు ఉత్పత్తి చేయడంలో వోల్వో ప్రసిద్ధి చెందిన విషయం చాల మందికి తెలసిందే. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లపై దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వోల్వో XC40 రీచార్జ్, XC60 SUVపై భారీ తగ్గింపును ప్రకటించింది. అలాగే XC40పై ఆరు సంవత్సరాల గ్యారంటీని ప్రకటించింది. ఈ సందర్భంగా వోల్వో కారు సర్వీస్ ప్లాన్, 4 సంవత్సరాల డిజిటల్ సేవలు, 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీని ఇస్తోంది. అలాగే 11 కిలోవాట్ వాల్ బాక్స్ ఛార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
XC40 కారు రూ. 56.90 లక్షలు ఉండేది. ప్రస్తుతం దీపావళి ఆఫర్ ను ప్రకటించడంతో దీనిని రూ.55.12 లక్షలకు సొంతం చేసుకోచ్చు. అంటే మొత్తంగా 1, 78, 500 వరకు తగ్గింపును ప్రకటించారు. XC60 SUVపై ఏకంగా 6.95 లక్షల తగ్గింపును ప్రకటించారు. ఈ కారు ప్రస్తుతం రూ.67.85 లక్షల ప్రారంభ ధరతో అమ్ముతున్నారు. దీపావళి ఆఫర్లో భాగంగా రూ.60.90 లక్షలతో కొనుగోలు చేయొచ్చు. అయితే దీపావళి ఫెస్టిఫల్ ఆఫర్ ఉన్నంత వరకే ఇది వర్తిస్తుంది.
ఈ మోడల్ భారత్ లో సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. ఇందులో 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. అలాగే 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 250 బీహెచ్ పీ పవర్ తో పాటు 350 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. XC60 లో ఫ్రంట్ గ్రిల్,అలాయ్ వీల్స్ ను కలిగి ఉన్నాయి. ఇది డెనిమ్ బ్లూ, ప్లాటినమ్ గ్రే తో పాటు ఒనిక్స్ బ్లాక్ లో రంగుల్లో అందుబాటులో ఉంది.