Vivo X300 FE: ప్రస్తుత కాలంలో మొబైల్ కొనుగోలు చేసేవారు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎందుకంటే ప్రతి అవసరానికి ఫోన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో మెరుగైన బ్యాటరీ ఉండే మొబైల్స్ మాత్రమే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. వీరి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు సైతం బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచి మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇలాంటి వాటిలో Vivo కంపెనీ లేటెస్ట్ గా ఓ మోడల్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. అయితే ఇందులో కేవలం బ్యాటరీ విషయం మాత్రమే కాకుండా ఆకట్టుకునే విధంగా స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. మరి ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం..
Also Read: శ్రీలంక జట్టు ఇంటికి వెళ్లడం ఖాయమైంది.. వెళ్తూ వెళ్తూ పాకిస్థాన్‌ను కూడా తోడు తీసుకెళ్తుందా?
చైనా కంపెనీ Vivo ఇప్పటికే భారత మార్కెట్లోకి చొచ్చుకు పోయింది. ఈ కంపెనీకి చెందిన కెమెరా ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బ్యాటరీ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి కొత్తగా రాబోతున్న Vivo x 300 FE అనే మొబైల్ గత ఏడాదిలో గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయింది. ఇది త్వరలోనే ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మొబైల్ లో 6500 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 90 W వైర్డ్,40 W వైర్లెస్ చార్జింగ్ కు సపోర్ట్ ఇవ్వనుంది. ఈ బ్యాటరీ ఒరిజిన్ OS తో పని చేస్తుంది. దీంతో రోజంతా మొబైల్ వినియోగించేవారు.. గేమింగ్ ఎక్కువగా దృష్టి పెట్టేవారు ఈ బ్యాటరీ బాగా సరిపోతుందని అంటున్నారు.
Vivo x 300 FE మొబైల్ లో కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా కెమెరా పని తీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా పనిచేస్తుంది. దీంతో ఫోటో తీసుకునే సమయంలో ఎంత జూమ్ చేసినా కూడా resolution తగ్గే అవకాశం ఉండదు. అలాగే 50 MP సెల్ఫీ కెమెరా ఉండడంతో వీడియో కాలింగ్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. ఈ మొబైల్ 1.5 కె రిజల్యూషన్ తో డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.5000 nits బ్రైట్నెస్ తో ఉండే ఈ మొబైల్ మార్చిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.54,999 ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది.