Vivo X Fold 6 Features: Vivo కంపెనీ తన తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6ని త్వరలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, టీజర్లు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫోన్ గురించి వివరాల్లోకి వెళితె..
Vivo కొత్త ఫోన్ X Fold 6 కేవలం ఒక పెద్ద స్క్రీన్ ఉన్న ఫోల్డబుల్ ఫోన్‌ను అందించడమే కాకుండా.. వినియోగదారులకు బిగ్ టాస్క్ ను పూర్తి చేసే సామర్థ్యాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా OriginOS 6-Fold సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది మల్టీ టాస్కింగ్ కోసం కొత్త ‘అటామిక్ వర్క్‌బెంచ్’ మోడ్‌ను పరిచయం చేస్తోంది. ఇది ఒకే సమయంలో పలు యాప్‌లను సులభంగా రన్ చేయడానికి, పనులను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.
Vivo X Fold 6 పూర్తిగా AI ఫీచర్లపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో మెరుగుపరిచిన AI అసిస్టెంట్స్, ఆన్ డివైస్ AI ప్రాసెసింగ్, డ్యూయల్ డివైస్ బడ్డీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ యాప్ రన్నింగ్, క్రాస్ విండో ఇంటరాక్షన్స్, టాస్క్ ఓరియెంటెడ్ వర్క్‌స్పేస్ వంటివి దీనికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ ఫోన్ MediaTek యొక్క సరికొత్త Dimensity 9500 చిప్సెట్తో రానున్నట్లు సమాచారం.
ఈ ఫోన్ వెనుక భాగంలో ఆకర్షణీయమైన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లతో కూడిన శక్తివంతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఫోన్ చూడటానికి చాలా స్లిమ్ మరియు ప్రీమియం లుక్‌తో, బ్లూ-గ్రీన్ వంటి కొత్త రంగులలో లభించనుంది.
ఈ ఫోల్డబుల్ ఫోన్లో అత్యంత భారీగా 6,900mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. ఇది ఫోల్డబుల్ కేటగిరీలో చాలా పెద్దది. దీంతో వినియోగదారులు ఎక్కువ సమయం మల్టీ టాస్కింగ్, ప్రొడక్టివిటీ పనులను ఆటంకం లేకుండా పూర్తి చేయవచ్చు. భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ నెలాఖరులో చైనాలో అధికారికంగా విడుదల కానుంది. ప్రస్తుతం చైనా మార్కెట్ కోసం దీనిని సిద్ధం చేస్తున్నా, త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీనిని విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
