Lava Shark 2 5G: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆకట్టుకునే మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకు వస్తుంటాయి. అలాంటి కంపెనీల్లో LAVA ఒకటి. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా ‘లావా షార్క్ 2 5G’ (Lava Shark 2 5G)అనే మొబల్ త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో విడుదలైన లావా షార్క్ 5G కి అప్ గ్రేడ్ వెర్షన్‌గా ఉండనుంది. అంతేకాకుండా ఈ కొత్త మొబైల్ లో ప్రత్యేకంగా కెమెరా, డిజైన్, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండడంతో గ్రామీణ యూజర్లను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉంటుందంటే?
Lava Shark 2 5G భారత మార్కెట్‌లో మే నెలలోనే లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా సూచించింది. ఈ కొత్త ఫోన్ ను చూస్తే ఐఫోన్ లా కనిపించే విధంగా మోడర్న్ డిజైన్ చేశారు. దీని కెమెరాను చూస్తే ప్రీమీయం ఫోన్ అని అంటారు. ఇందులో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుందని లీక్ అయిన సమాచారం భట్టి తెలుస్తోంది. అలాగే ఇది90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా Unisoc చిప్‌సెట్, T765 ఆక్టా‑కోర్ 5G ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫోన్లో డేటా స్పీడ్ తో పాటు మల్టీటాస్కింగ్ కోసం సరిపోతుంది.
బేస్ వేరియంట్‌లో 4GB RAM, 64GB స్టోరేజీ ఉండనుంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు. ఈ కొత్త షార్క్ 2 5Gలో 50MP AI అవెంస్‌డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఈ కెమెరాతో డే లైట్ పిక్చర్స్, ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్స్ బెటర్ అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఫ్రంట్ కెమెరా కోసం 5MP లేదా 8MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా.. రోజంతా వినియోగించినా సపోర్టు చేయనుంది. ఈ బ్యాటరీకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5G, 4G VoLTE, Wi‑Fi, బ్లూటూత్ 5.0, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు సౌకర్యాన్ని అందిస్తాయి.
షార్క్ 5G లాగానే ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత స్కిన్ తో పనిచేసే అవకాశం ఉంది. ఇది డేట్ సేఫ్ చేసిన సెక్యూరిటీ అప్‌డేట్లు మరియు స్మూత్ UI ఇస్తుంది. బడ్జెట్ ప్రైస్‌లో 5G కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఫోన్. ఇందుకంటే దీనిని రూ.8,000 రేంజ్‌లోనే విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణాల్లో ఉండేవారికి ఈ మొబైల్ బాగా ఉపయోగపడనుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ పై కూడా ఆఫర్ల ఉండే అవకాశం ఉంది. అయితే విడుదలయ్యే నాటికి వాటి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
