Vivo T5 Lite 5G: తక్కువ బడ్జెట్ లో మొబైల్ కొనాలని చూసేవారికి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో అనుగుణంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీ మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా అద్భుతమైన ఫీచర్లతో కొత్త మొబైల్ ను రిలీజల్ చేసింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీ బ్యాకప్ తో పాటు మరియు మిలిటరీ గ్రేడ్ మన్నిక వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇంతకీ ఇది ఏ ఫోన్? ఈ ఫోన్ లో ఇంకా ఉండే ఫీచర్లు ఏంటీ?
Vivo కంపెనీ నుంచి రిలీజైన సరికొత్త 5G మొబైల్ Vivo T5 Lite 44W 5G. ఈ ఫోన్ ముఖ్యంగా తక్కువ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది. ఇందులో 6,500mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌ను అందించారు. ఈ బ్యాటరీ దాదాపు ఐదేళ్ల పాటు మన్నికగా ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రొసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ తో పాటు సాధారణ గేమింగ్‌ను స్మూత్‌గా రన్ చేస్తుంది.
వివో T5 లైట్ ఫోన్ 6.74 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇందులో ఇచ్చారు. అలాగే ఎక్కువ సమయం ఫోన్ చూసినా కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకమైన ఐ ప్రొటెక్షన్ ను కూడా ఏర్పాటు చేశారు.
వివో ఫోన్ అనగానే కెమెరా క్వాలిటీ గురించి చెబుతారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఈ మొబైల్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ ప్రధాన కెమెరాను అందించారు. ఇది తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన ఫోటోలను తీయగలదు. దీనితో పాటు ఒక సహాయక లెన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఫోటోలను మరింత అందంగా మార్చడానికి AI UHD, AI కలర్ అడ్జస్ట్‌మెంట్ వంటి స్మార్ట్ AI కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
భారత మార్కెట్లో Vivo T5 Lite 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB RAM తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఫోన్ ధర రూ.19,999 ఉండగా.. 6GB RAM తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన మొబైల్ ను రూ. 21,999తో విక్రయిస్తున్నారు. అలాగే ఈ ఫోన్ ప్రారంభ ఆఫర్ల కింద SBI, HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది, దీనివల్ల బేస్ వేరియంట్‌ను రూ.18,499 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకోవచ్చు. జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో అఫీషియల్ స్టోర్ మరియు ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ కొత్త ఫోన్ ప్రారంభం కానుంది.
