Vivo mobiles : మార్కెట్లోకి ఏ కొత్త Mobile వచ్చినా.. సొంతం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలో కొత్త ఫోన్ల సమాచారం గురించి తెలుసుకుంటారు. వీటిలో కొన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి కొత్త మోడల్స్ రిలీజ్ అయిన సందర్భంగా వాటికి డిమాండ్ ఉంటుంది. అయితే చైనాకు చెందిన Vivo కంపెనీ నుంచి తాజాగా కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. దీని ఫీచర్స్, సామర్థ్యం, బ్యాటరీ విషయం తెలిసి యూత్ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ మొబైల్ లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వచ్చి వీవో మొబైల్స్ లో కెమెరా హై క్వాలిటీతో ఉండేది. ఇప్పుడీ మొబైల్ లో కూడా ఆకర్షించేవిధంగా ఉంది. మరి ఈ మొబైల్ వివరాల్లోకి వెళితే..
Also Read : 3 రోజుల్లో 1 లక్ష డాలర్లు..నార్త్ అమెరికాలో ‘హరి హర వీరమల్లు’ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్!
Vivo కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన లేటేస్ట్ మోడల్ Vivo V60 Ultra 2025. ఈ మొబైల్ హైఎండ్ మెటల్ గ్లాస్ తో అమర్చబడింది. ఇది 6.8 అంగుళాల HD+Amoledక్వాలిటీతో పనిచేస్తుంది.దీని రిజల్యూషన్ 3200X1440 గా ఉంది. 144 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇది 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. 200 మెగా పిక్సెల్ సిస్టమ్ తో పనిచేస్తూ అదనపు అల్ట్రా వైడ్, టెలి ఫోటో, మాక్రో సెన్సార్లకు మద్దతు ఇస్తుంది.
కొత్తగా వచ్చిన అల్ట్రా మొబైల్ లో 6400mAh బ్యాటరీని అమర్చారు. 120 వైర్డ్ తో పాటు 50 వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంది. అలాగే యాక్సెసరీలకు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ మొబైల్ 16 జీబీ రామ్ తో పాటు 1 TB స్టోరేజ్ ను కలిగి ఉంది. అద్భుతమైన సామర్థ్యంతో పాటు మల్టీ టాస్కింగ్, గేమింగ్, హెవీ డ్యూటీ యాప్ లను ప్రోత్సహిస్తుంది. వైఫై 7 తో పాటు బ్లూటూత్ 5.4 ను యాక్సెస్ చేస్తుంది. 5 జీ సపోర్ట్ చేస్తూ USB 3.2 కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్లు, హై రెస్ ఆడియో, ఇన్ డిస్ ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్స్ వంటి సెన్సార్ ను కలిగి ఉంది.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ లో విలన్ గా రష్మిక..? ఆమె లుక్ ఎలా ఉండబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ కొత్త మొబైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. Vivo V60 అల్ట్రా బేస్ 12 జీబీ ర్యామ్ సపోర్ట్ చేస్తూ 256 స్టోరేజ్ ఉంటే రూ.59,990గా ఉంది. Vivo V60 అల్ట్రా బేస్ 16 జీబీ ర్యామ్ సపోర్ట్ చేస్తూ 512 స్టోరేజ్ ధర రూ.66,990కాగా.. Vivo V60 అల్ట్రా బేస్ 16 జీబీ ర్యామ్ సపోర్ట్ చేస్తూ 1 టీబీ స్టోరేజ్ ఉంటే రూ.74,990గా రనిర్ణయించారు. ఈ మొబైల్ అత్యధిక స్పీడ్ తో ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో 8 జనరేషన్ చిప్ ను కలిగి ఉండడంతో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది.