Homeజాతీయ వార్తలుVijay Pat Singhania Downfall Story: ఒకప్పుడు 12,000 కోట్ల వ్యాపారి.. చివరికి అద్దె గదికి...

Vijay Pat Singhania Downfall Story: ఒకప్పుడు 12,000 కోట్ల వ్యాపారి.. చివరికి అద్దె గదికి అతని జీవితం పరిమితం

Vijay Pat Singhania Downfall Story: ఓడలు బండ్లు అవుతుంటాయి. బండ్లు ఓడలు అవుతుంటాయి. కాకపోతే ఓడలు బండ్లు అవ్వడాన్ని ఈ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. వింతగానూ అభివర్ణిస్తుంది. అవసరమైతే బండ్లపై నాలుగు రాళ్లు కూడా వేస్తుంది. చెడి బతకడం పెద్ద ఇబ్బంది కాదు. బతికి చెడితేనే ఇబ్బంది. అప్పటిదాకా సెల్యూట్ కొట్టిన ఈ సమాజం ఛీ అంటుంది. రెడ్ కార్పెట్ పరిచిన పౌరగణం దూరంగా జరుగుతుంది. అందుకే వచ్చిన స్థితిని.. లభించిన డబ్బును.. అధిరోహించిన శిఖరాలను కాపాడుకోవాలి అంటారు.

మనదేశంలో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు చాలా ఉన్నాయి. అందులో పేరెన్నిక గల కార్పొరేట్ సంస్థలలో రేమండ్ ఒకటి. వస్త్రాలకు.. ఇతర ఉత్పత్తులకు రేమండ్ కంపెనీ పేరు పొందింది. ఇప్పుడంటే మార్కెట్లో రకరకాల కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ ఒకప్పుడు రేమండ్ మాత్రమే వస్త్ర ప్రపంచాన్ని శాసించేది. సెలబ్రిటీలు తమ ధరించే సూటు.. ఇతర వస్త్రాలను రేమండ్ కంపెనీ తయారుచేసినవే కొనుగోలు చేసేవారు.. నాడు ఆ కంపెనీ విలువ కూడా విపరీతంగా ఉండేది. ఆ కంపెనీని స్థాపించిన వ్యక్తి పేరు విజయ్ పత్ సింఘానియా.

రేమండ్ కంపెనీ ద్వారా వేల కోట్ల వ్యవస్థను ఏర్పాటు చేసి.. వేలాది మందికి ఉపాధి కల్పించారు విజయ్. అప్పట్లో ఆయన మనదేశంలో అత్యంత ప్రముఖమైన కార్పొరేట్ దిగ్గజంగా ఉండేవారు. ప్రభుత్వాలకు ఏవైనా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు విరాళాలు ఇచ్చేవారు. ప్రజలకు ఇతోదికంగా సహాయం చేసేవారు. అందువల్లే ఆయనను దానంలో కర్ణుడు అని పిలిచేవారు. 12వేల కోట్ల ఆస్తులను సృష్టించిన విజయ్.. తీసుకున్న ఒక నిర్ణయం ఆయనను రోడ్డుమీదికి నెట్టింది.

2018 సంవత్సరంలో 12 వేల కోట్ల కంపెనీ ఆస్తుల తో పాటు 37% వాటా (1000 కోట్లు) కొడుకు గౌతమ్ కు విజయ్ బదిలీ చేశారు. ఆస్తులు దక్కిన తర్వాత గౌతమ్ తన తండ్రిని పట్టించుకోవడం మానేశారు. చివరికి ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో.. విజయ్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొడుకును నమ్మినందుకు.. ఆస్తులు మొత్తం ఇచ్చినందుకు.. తాను అనుభవిస్తున్నారని విజయ్ అనేక సందర్భాల్లో చెప్పారు.

ప్రస్తుతం విజయ్ చరమాంకంలో ఉన్నారు. సొంత ఇల్లు లేకపోవడంతో.. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సకల సౌలభ్యాలను వదిలేసి.. మామూలు జీవితాన్ని గడుపుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ నౌకర్లు.. పదులకొద్ది వాహనాలతో వైభవమైన జీవితాన్ని గడిపిన ఆయన ఇప్పుడు ఇలా మారడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు అధిపతులు విజయ్ జీవితాన్ని ఒక పాఠం గా చూడాల్సిన అవసరం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular