Ventilated Seats
Ventilated Seats: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి.. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఇళ్లలో, కార్లలో ఏసీలను ఉపయోగిస్తున్నారు. చాలా సార్లు కారులో ఏసీ వేసినప్పటికీ వెనుక భాగంలో చెమట పడుతుంది. అయితే, ఈ సమస్యను వెంటిలేటెడ్ సీట్ల ద్వారా పరిష్కరించవచ్చు. వెంటిలేటెడ్ సీట్ల గురించి మీకు తెలియకపోతే.. వేసవి కాలంలో వెంటిలేటెడ్ సీట్ల నుంచి చల్లని గాలి వస్తుంది. అది మీ వెనుక భాగానికి చల్లని అనుభూతిని కలిగిస్తుంది. ఈ రోజు మనం వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్‌తో లభించే 5 చౌకైన కార్ల గురించి తెలుసుకుందాం.
Also Read: రిలీజ్‌కు ముందే కార్ల బుకింగ్స్ షురూ..బీఎండబ్ల్యూ, టయోటాకు ఇక కష్టకాలమే?
టాటా ఆల్ట్రోజ్ రేసర్
టాటా మోటార్స్ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.. కానీ ఈ కారు అన్ని వేరియంట్‌లలో ఈ సౌకర్యం లేదు. ఈ కారులోని ఆర్ 3 వేరియంట్‌లో ఈ ఫీచర్ మీకు లభిస్తుంది. అయితే ఈ వేరియంట్‌ను కొనడానికి మీరు రూ.10,99,990 (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కియా సోనెట్
కియా ఈ పాపులర్ సబ్ కాంపాక్ట్ SUVలో కూడా వెంటిలేటెడ్ సీట్ల ఆఫ్షన్ ఉంది. అయితే మీకు ఈ ఫీచర్ కావాలంటే ఈ కారు HTX లేదా అంతకంటే ఎక్కువ వేరియంట్‌ను కొనుగోలు చేయాలి. HTX వేరియంట్ ధర రూ.11,82,900 (ఎక్స్-షోరూమ్).
టాటా నెక్సాన్
టాటా మోటార్స్ ఈ కారులో కూడా వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఫీచర్‌ను కంపెనీ Fearless Plus వేరియెంట్లో అందిస్తోంది. ఈ వేరియంట్‌ను కొనడానికి రూ.13,29,900 (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కియా సిరోస్
కియా ఈ కొత్త కారులో కూడా కంపెనీ వెంటిలేటెడ్ సీట్ల ఆఫ్షన్లు అందించింది. ఈ కారు HTX, అంతకంటే ఎక్కువ మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. HTX వేరియంట్ కోసం రూ.₹13,29,900 (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
టాటా కర్వ్
టాటా మోటార్స్ మొదటి కూపే SUV కర్వ్ Accomplished S వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్ కోసం మీరు రూ.14,86,900 (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కంటే ఎక్కువ వేరియంట్‌లలో మీకు ఈ ఫీచర్ లభిస్తుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ventilated seats cool your car seats in summer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com