Homeబిజినెస్Urban Cruiser Ebella: ఫ్యామిలీతో కలిసి తక్కువ ధరలో విహారయాత్రలకు వెళ్లొచ్చు.. అలాంటివారికి ఈ కారు...

Urban Cruiser Ebella: ఫ్యామిలీతో కలిసి తక్కువ ధరలో విహారయాత్రలకు వెళ్లొచ్చు.. అలాంటివారికి ఈ కారు స్పెషల్..

Urban Cruiser Ebella: ఉమ్మడి కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. ఒకప్పుడు ప్రత్యేకంగా అద్దె వాహనాలను తీసుకొని ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కారు ప్రయాణికులతో పాటు లగేజ్ తో కూడా సౌకర్యవంతంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి అవసరం ఉన్నవారికి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పిస్తూ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అంతేకాకుండా సుదూరం ప్రయాణించే వారికి మైలేజ్ విషయంలో కూడా బడ్జెట్ కు ఉండేవిధంగా తీర్చిదిద్దారు. అలాంటి కారు గత నెలలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం..

SUV కార్లలో తీసుకురావడంలో Toyota ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకురావడంలో ఈ కంపెనీ శ్రద్ధ చూపుతోంది. లేటెస్ట్ గా టయోటా నుంచి Urban Cruiser Ebella అనే కారు ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఫ్యామిలీతో కలిసి సుదూర ప్రయాణం చేయడానికి అనుగుణంగా ఉండనుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఉన్న ఈ కారు మైలేజ్ విషయంలో కూడా బడ్జెట్ కు అనుగుణంగా ఉంటుంది. Ebella ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. దీనికి ఉండే LED హెడ్ లాంప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి డే అండ్ నైట్ రన్నింగ్ లైట్లు కావడంతో ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా ఈ కారు స్మార్ట్ లుక్ తో ఉంటుంది. దీనికి ముందు భాగంలో ఎయిర్ వెంట్స్ ఆకర్షనీయంగా ఉంటుంది.

ఎక్స్టీరియర్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ను అమర్చారు. అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి స్మార్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. సాఫ్ట్ టచ్ తో కూడిన డాష్ బోర్డు, మెటీరియల్స్ డ్రైవర్తోపాటు ప్రయాణికులకు స్మూత్ గా అనిపిస్తుంది. లెగ్ రూమ్ ఎక్కువగా ఉండడంతో కూర్చునే వారికి సౌకర్యవంతంగా ఉండడంతోపాటు అడ్జస్ట్మెంట్ సీట్లు ఉంటాయి. వెనక సీట్లో ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. అలాగే ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఉండడంతో వెంటిలేషన్ ఆహ్లాదంగా అనిపిస్తుంది. సేఫ్టీ కోసం ఈ కారులో లెవెల్ 2 ADAS టెక్నాలజీ తో పాటు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారులో రెండు రకాల బ్యాటరీలు ఉండనున్నాయి. ఇందులో ఒకటి 49 kW బ్యాటరీ 144 Bhp పవర్ ను అందిస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 440 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే 61 kWh బ్యాటరీ చార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీ పర్ఫామెన్స్ తో స్పోర్ట్స్ కారులో ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఎన్ని రకాల సౌకర్యాలు, ఫీచర్లు ఉన్న ఈ కారును రూ.18 లక్షల ప్రారంభ ధర నుంచి వేరియంటు ను బట్టి రూ.21 లక్షల వరకు కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular