UPI : సామాన్యుడి జీవితం రేపటి నుంచి కొంచెం మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి జీవితాన్ని సులభతరం చేసిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ చేసే వాళ్లకు రేపటి నుండి కష్టాలు పెరిగే అవకాశం ఉంది. రేపటి నుండి పెట్రోల్ బంకు యజమానులు యూపీఐతో సహా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డబ్బు తీసుకోబోమని ప్రకటించారు. డిజిటల్ పేమెంట్ ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న కారణంగా దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ బంకు యజమానులు, సంఘాలు డిజిటల్ విధానంలో పేమెంట్ తీసుకోకూడదని నిర్ణయించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం.. ఈ నగరాల్లో పెట్రోల్ బంకులు కేవలం యూపీఐ ద్వారా పేమెంట్ తీసుకోవడాన్ని మాత్రమే ఆపడం లేదు. మే 10 నుండి కార్డుల ద్వారా పేమెంట్ తీసుకోవడాన్ని కూడా నిలిపివేస్తామని హెచ్చరించాయి.
Also Read : యూపీఐ ఐడీ ఇక సేఫ్.. క్రెడిట్ కార్డ్‌లా ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోండి!
ఇటీవల విదర్భ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ.. సైబర్ మోసాలు పెరుగుతున్న కారణంగా పెట్రోల్ బంకు యజమానులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. దీనివల్ల వారికి ఆర్థిక నష్టం కూడా కలుగుతోంది. మోసగాళ్లు ప్రజల కార్డులు లేదా నెట్‌బ్యాంకింగ్‌ను హ్యాక్ చేసి దాని ద్వారా పేమెంట్ చేస్తున్నారు. తర్వాత ఎవరైనా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఆ ట్రాన్సాక్షన్లను రద్దు చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ.. ఈ తరహా సైబర్ మోసాల కారణంగా అనేక పెట్రోల్ బంకు యజమానుల ఖాతాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయని తెలిపింది. దీనివల్ల వారికి ఒకవైపు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది, మరోవైపు ఇతర పేమెంట్లు తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతోంది.
నాసిక్‌లోని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఈ విషయంలో అనేక మంది పెట్రోల్ బంకు యజమానుల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. వారి డిజిటల్ లావాదేవీలు క్యాన్సిల్ అవుతున్నాయి. తర్వాత వారి ఖాతాలు బ్లాక్ అవుతున్నాయి. ముందు ఈ మొత్తం చాలా తక్కువగా ఉండేదని, అందుకే చాలాసార్లు పెట్రోల్ బంకుల వారు దీనిపై శ్రద్ధ చూపేవారు కాదని అన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : అటు UPI, ఇటు WhatsApp అంతరాయం.. ఇంతకీ ఏమైంది?
ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ గుప్తా మాట్లాడుతూ.. ఈ విషయం గురించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. తగిన చర్య తీసుకుంటామని హామీ లభిస్తేనే పెట్రోల్ బంకు యజమానులు డిజిటల్ పేమెంట్‌ను తిరిగి ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని మహారాష్ట్రలోని పెట్రోల్ పంప్ అసోసియేషన్ అమలు చేయబోతోంది. కాబట్టి దేశవ్యాప్తంగా దీని స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సైబర్ మోసం ఈ రోజుల్లో నిజంగా ఒక పెద్ద సమస్యగా మారుతోంది.