UPI Payments : ఆగిపోయిన UPI చెల్లింపులు.. అసలేం జరిగిందంటే?

క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత ‘UPI Issue a reciever's bank! అని మెసేజ్ వస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : February 7, 2024 12:30 pm

Wrong UPI Transfer

Follow us on

UPI Payments : ఫైనాన్స్ కార్యకలాపాలకు ఒకప్పుడు బ్యాంకు వేదికగా ఉండేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ మయం కావడంతో ప్రతి ఒక్కరూ దాదాపు ఆన్ లైన్ ద్వారా మనీ ట్రాన్జాక్షన్ చేస్తున్నారు. ఈజీగా మనీ సెండ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి వివిధ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. కొన్ని బ్యాంకులు కూడా ప్రత్యేకంగా యాప్ లను రూపొందించి వీటి ద్వారా చెల్లింపులు చేయాలని కోరుతున్నాయి. అయితే ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇది చేయాలంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. అత్యవసర సమయంలో నెట్ అందుబాటులో లేకపోవడతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా కొందరు వినియోగదారులు అదే ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం 90 శాతం మంది మనీ ట్రాజ్జాక్షన్ ను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లిస్తున్నారు. మొన్నటి వరకు సెండర్ బ్యాంక్ ఆకౌంట్ లేదా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి డబ్బలు పంపించేవాళ్లు. అయితే ఇందులో కొన్ని మోసాలు జరుగుతున్నాయన్ని గుర్తించి యాప్ సంస్థలు Unified Payments Interface (UPI) లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ద్వారా చెల్లింపులు చేస్తే ఎవరైతే రిసీవర్ అనుకున్నారో..కచ్చితంగా వారికే మనీ వెళ్తుంది. అయితే తాజాగా ఇది సమస్యలు ఎదుర్కొంటోంది.

ఈరోజుల్లో ఎక్కువ మంది వస్తువులు కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ పేమెంట్స్ నే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్బు చెల్లించేటప్పుడు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత ‘UPI Issue a reciever’s bank! అని మెసేజ్ వస్తుంది. దీంతో చాలా మంది షాపింగ్ చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొందరు ఆన్ లైన్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసేవాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు బ్యాంకు అకౌంట్ కు యూపీఐకి కనెక్ట్ కావడంతో కొన్ని బ్యాంకులు వీటి ద్వారా చెల్లింపులకు అభ్యంతరాలు చెబుతున్నాయి.

ఇటీవల పేటీఎం ట్రాన్జాక్షన్ పై ఆర్బీఐ పరిమితి విధించిన తరువాత ఇటువంటి మెసేజ్ లు రావడంతో చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఖాతాదారులు చెల్లింపులపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటువంటి మెసేజ్ లువస్తున్నాయని కొందరు అంటున్నారు. అయితే ఈ సమస్య పై త్వరగా స్పందించి పరిష్కరించాలని పలువురు వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా కోరుతున్నారు.