4G Smartphones: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం 5G నెట్ వర్క్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సౌకర్యం లేదు. అక్కడ ఇప్పటికీ 4G నెట్ వర్క్ మాత్రమే కొనసాగుతోంది. ఉదాహరణకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కోల్ కతాపట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో 4 జీ సేవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ 4జీ ఫోన్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇలాంటి వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొన్ని కంపెనీలు సరికొత్త 4G ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో భారీ సంఖ్యలో సరికొత్త మిడ్-రేంజ్ 4G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నట్లు టెక్ వర్గాల సమాచారం. వాటి వివరాల్లోకి వెళితె..
మోబైల్ ఇండస్ట్రీ నివేదికల ప్రకారం.. షియోమి , రెడ్‌మి , ఒప్పో , వివో తో పాటు రియల్‌మి వంటి అగ్రగామి సంస్థలు జూలై నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌లో తమ సరికొత్త మోడళ్లను రంగంలోకి దించనున్నాయి. ఇప్పటికే ఉన్న పాపులర్ సిరీస్‌లకు కొనసాగింపుగా ఈ సరికొత్త 4G వేరియంట్లు రాబోతున్నాయి.
ఈ మిడ్ రేంజ్ 4G ఫోన్లలో ఫీచర్లు మాత్రం ప్రీమియం రేంజ్‌లో ఉండనున్నాయి. 50MP ప్రధాన కెమెరాలు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్‌ప్లేలు, 6000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో ఇవి రానున్నాయి. వీటికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. మీడియాటెక్ హెలియో లేదా స్నాప్‌డ్రాగన్ బడ్జెట్ ప్రాసెసర్లు వీటిలో ఉపయోగించే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు దాదాపు రూ. 10,000 నుంచి రూ. 18,000 బడ్జెట్ లోపలే ఉండే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే పండగ సీజన్ సేల్స్ లక్ష్యంగా ఈ మొబైళ్లను విడుదల చేయనున్నారు. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే సరికొత్త ఫోన్ కోసం చూస్తున్న మిడిల్ క్లాస్ బయ్యర్లకు ఈ క్వార్టర్ లో భారీ ఆప్షన్లు లభించబోతున్నాయి.
