https://oktelugu.com/

పన్ను చెల్లింపుదారులకు మోదీ సర్కార్ భారీ ఝలక్..?

దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు పన్ను చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. 2021 – 2022 ఆర్థిక సంవత్సరం కోసం మోదీ సర్కార్ ఈ బడ్జెట్ ను తీసుకొస్తోంది. అయితే కొత్త బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు భారీ షాక్ ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. కరోనా విజృంభణ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2021 1:38 pm
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు పన్ను చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. 2021 – 2022 ఆర్థిక సంవత్సరం కోసం మోదీ సర్కార్ ఈ బడ్జెట్ ను తీసుకొస్తోంది. అయితే కొత్త బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు భారీ షాక్ ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.

    కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ పై సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. విద్య, ఆరోగ్యానికి కేంద్రం ఈ బడ్జెట్ లో కేంద్రం పెద్దపీట వేయనుందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ గతంతో పోలిస్తే పెరగనున్నాయని సమాచారం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పెరగడం ద్వారా హెల్త్ కేర్ వ్యయాలను పెంచవచ్చని మోదీ సర్కార్ భావిస్తోంది.

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సెస్ ను పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్‌ 4 శాతంగా ఉండగా ఈ సెస్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ద్వారా 30,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుండగా సెస్ 2 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మరోవైపు మోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ ను కూడా పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం సుముఖంగా ఉండటం గమనార్హం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పెరిగితే పన్ను చెల్లింపుదారులకు భారం మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.