Patanjali Products : ఈ రోజుల్లో పతంజలి గురించి గానీ, బాబా రామ్‌దేవ్ గురించిగానీ తెలియనివారు ఉండరు. యోగాతో ఫేమస్ అయిన రామ్‌దేవ్.. తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చారు. స్వచ్ఛమైన సరుకుల పేరుతో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ అన్ని రకాల ఆహాల పదార్థాలతోపాటు ఇతర ప్రొడక్ట్స్ కూడా విక్రయిస్తున్నారు. ఇటీవలే సుప్రీం కోర్టు పతంజరి యాజమాన్యాన్ని చివాట్లు పెట్టింది. క్షమాపణ చెప్పడంతోపాటు బహిరంగంగా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది. ఎలాంటి పరీక్షలు చేయకుండానే కొన్ని మందులను పతంజలి యాజమాన్యం ప్రచారం చేసింది. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినా వ్యాపారం చేయడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు క్షమాపణ కోరడంతోపాటు ఆ ఉత్పత్తులు నిలిపివేయాలని ఆదేశించింది. పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. అయితే తాజాగా పతంజలికి చెందిన ఓ ప్రొడక్టును ఆహార నియంత్రణ సంస్థ పరిశీలించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేవడంతో వెంటనే వాపస్ తెప్పించాలని ఆదేశించింది.
కారం.. గరం గరం..
బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఫుడ్స్‌కు ఎర్రకారం పొడిని వెనక్కు తీసుకోవాలని FSSAI ఆదేశించింది. ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ధిషటమైన ఎర్ర కారంపొడి ఆహార నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తించారు. అందుకే దానిని వెనక్కు తీసుకోవాలని తెలిపింది. ఈ బ్యాచ్ నంబర్ AJD2400012. ఇది FSSAI నియమాలు, 2011 నిబంధనలకు అనుగుణంగా లేదు. దీంతో ఈ బ్యాచ్ ఎర్రకారం పొడిని మార్కెట్ నుంచి వెంటనే ఉప సంహరించుకోవాలని సూచించింది. నిబంధనలు పాటించనందుకు ప్యాక్ చేసి నిర్ధిష్ట బ్యాచ్ ఎర్ర కారంపొడిని రీకాల్ చేయాలని ఆదేశించినట్లు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ గురువారం తెలిపింది. ఈ మేరకు జనవరి 13న రెగ్యులేటర్ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రమాణాలు పాటించనందుకే..
ఆహార భద్రత, ప్రమాణాలు(కలుషతం, విషపూరిత పదార్థాలు, అవశేషాలు) నిబంధనలు పాటించనందున రెగ్యూలేటర్ పతంజలి ఫుడ్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఇది బ్యాచ్ ఫుడ్‌ను జోడిస్తుంది. బ్యాచ్ నంబర్ AJD2400012. మొత్తం బ్యాచ్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు వచ్చాయి.
1986 నుంచి వ్యాపారం..
ఇదిలా ఉంటే పతంజలి ఫుడ్స్‌ను బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద గ్రూపునకు చెందిన సంస్థ. ఇది 1985లో స్థాపించబడింది. ఇది భారత దేశంలోని ప్రముఖ FMCG కంపెనీలలో ఒకటి. పూర్వం దీనిని చుచిపోయా అని పిలిచేవారు. కంపెనీ ఎడిబుల్ ఆయిల్ ఫుడ్ FMCG పవన విద్యుత్ ఉత్పత్తి రంగాలలో ఉంది. పతంజలి రుచి గోల్డ్, న్యూట్రెల్లా మొదలైన వివిధ బ్రాండ్‌ల క్రింద ఉత్పత్తులను విక్రయిస్తుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ స్టాండ్ అలోన్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.308.97 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.254.53 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో రూ.7,845.79 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో రూ.8,198.52 కోట్లకు పెరిగింది.