TVS Sport : ఇండియా టూ వీలర్ దిగ్గజ కంపెనీ టీవీఎస్ మోటార్ త్వరలోనే మార్కెట్లో తన అత్యంత చౌకైన బైక్ సరికొత్త మోడల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ కొత్త బైక్ టీవీఎస్ స్పోర్ట్ అప్ డేటెడ్ వెర్షన్ కాబోతుంది. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ ద్వారా బైక్ కొత్త కలర్ ఆఫ్షన్లతో మార్కెట్లోకి రాబోతుందని అర్థం అవుతుంది. కొత్త రంగులతో పాటు కొత్త గ్రాఫిక్ డిజైన్‌ను కూడా చూడవచ్చు. అయితే, ఈ మార్పుల కారణంగా బైక్ ధరలో కాస్త పెరుగుదల ఉండవచ్చు.
Also Read: కారులో ఏది పని చేయకపోయినా హ్యుందాయ్ ఫ్రీ సర్వీస్ క్యాంప్ డీటెయిల్స్ ఇవే
ప్రస్తుతం టీవీఎస్ స్పోర్ట్ ధర దాదాపు రూ.60 వేల నుంచి ప్రారంభమై రూ.72వేల మధ్య ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉంటాయి. ఈ బైక్ ES, ELS అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య గ్రాఫిక్స్ మాత్రమే తేడా. కొత్త కలర్ స్కీమ్‌తో పాటు ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్, హెడ్‌లైట్ కౌల్‌పై కూడా గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ బైక్‌ను మొదట 100సీసీ ఇంజిన్‌తో విడుదల చేశారు. కానీ ఏప్రిల్ 2020లో BS6 అప్‌డేట్‌తో టీవీఎస్ దీనిని పెద్ద 110సీసీ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసింది.
టీవీఎస్ స్పోర్ట్‌లో 109.7సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 7,350 rpm వద్ద గరిష్టంగా 8.08 bhp పవర్, 4,500 rpm వద్ద 8.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ 4-స్పీడ్ యూనిట్‌ను కలిగి ఉంది. అయితే, బ్రేకింగ్ కోసం స్పోర్ట్ ముందు, వెనుక భాగాలలో డ్రమ్ బ్రేక్‌లను మాత్రమే కలిగి ఉంది. డిస్క్ బ్రేక్ ఇందులో లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. వీటిని ప్రీలోడ్ కోసం 5-స్టెప్ అడ్జస్టబిలిటీతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ బైక్ లీటరుకు దాదాపు 75 నుండి 80 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఇది దాని సీరిస్ లలో బెస్ట్ మైలేజీల్లో ఒకటిగా చెప్పొచ్చు.
టీవీఎస్ స్పోర్ట్‌లో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇందులో స్పీడోమీటర్ , ఫ్యూయల్ గేజ్ ఉన్నాయి. ఇది ఎకానమీ మీటర్, పవర్ లైట్‌ను కూడా ఉంది. అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు దీని ప్రత్యేకతలు. అదనంగా, ఇది ఎలక్ట్రిక్ స్టార్టర్‌ను కూడా కలిగి ఉంది. బైక్‌లో కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ ఆఫ్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ బ్లాక్/రెడ్, రెడ్, వైట్/పర్పుల్, వైట్/రెడ్, గ్రేతో సహా మొత్తం 5 కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ హోండా షైన్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా, హీరో స్ప్లెండర్, బజాజ్ సిటి 110ఎక్స్ వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది. ముఖ్యంగా మైలేజ్ విషయంలో ఇది వాటికి సవాలు విసిరే ఛాన్స్ ఉంది.