TVS Jupiter 125 2026 New Model Features: భారతీయ రోడ్లపై స్కూటర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు రోజువారి అవసరాలతో పాటు దూర ప్రయాణాలకు బైక్స్ మాత్రమే కొనుగోలు చేసిన వారు సైతం ఇప్పుడు స్కూటర్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా కంపెనీలు సైతం వినియోగదారులకు అనుగుణంగా స్కూటర్లను తీర్చిదిద్ది మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇలాంటి కంపెనీలో TVS గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Jupiter ప్రత్యేక గుర్తింపు పొందింది అయితే 2026 సంవత్సరంలో ఇది అప్డేట్ ఐ కొత్త వెర్షన్ లో రాబోతుంది. నేటి తరానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు.. మైలేజ్ విషయంలో మెరుగైన పనితీరు సాధించి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉండబోతుంది అంటే?
TVS Jupiter 125 కొత్త స్కూటర్ నేటితరం వారిని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో యూత్ సైతం తిరిగి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ స్కూటర్కు ఉండే LED హెడ్ లాంప్స్, రీ డిజైన్ చేసిన బాడీ ప్యానెల్ వంటివి ప్రీమియం లుక్ తో ఉన్నాయి. దీనిపై నగరంలో ప్రయాణం చేస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. దీనిపై ఉండే గ్రాఫిక్స్ సైతం స్టైలిష్ గా ఉంటాయి. ఈ స్కూటర్ లో 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 8.2 బిహెచ్పి పవర్ అందిస్తూ స్మూత్ డ్రైవింగ్ ను కలిగి ఉంటుంది దీంతో కొత్తగా స్కూటర్ నడిపే వారికి సైతం అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేయడం వల్ల ఎలాంటి రోడ్లపై నైనా స్మూత్ గా ప్రయాణం చేయవచ్చు. నగరాల్లో ఉండే ట్రాఫిక్ లో నుంచి కూడా బయటపడేందుకు ఇంజన్ సహకరిస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 69 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీంతో ఇంధనా పొదుపు చేయాలని అనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో వేగం, ఇందర స్థాయి, ట్రిప్ వివరాలు, నావిగేషన్ వంటి సమాచారాన్ని చూడవచ్చు. కొన్ని వేరియంట్లలో నావిగేషన్ అలర్ట్ కూడా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిపై ఉండే సీటింగ్ కంఫర్టబుల్గా ఉండడంతో దూర ప్రయాణాలు చేసినా కూడా ఎలాంటి అలసట అనిపించదు. కఠినమైన రోడ్లపై కూడా సులభంగా వెళ్లేలా దీనికి సస్పెన్షన్ సిస్టం సపోర్టుగా అమర్చారు. అలాగే సీటు కింద విశాలమైన స్పేస్ ఉండడంతో వస్తువులను తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉంటుంది. స్కూటర్ మధ్య భాగంలో కూడా తగినంత స్థలం ఉండడంతో వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
2026 కొత్త సంవత్సరం సందర్భంగా మార్కెట్లోకి రాబోతున్న టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ధర రూ.73,840 తో విక్రయించనున్నారు. ఫ్యామిలీతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు, యువకులు సైతం దీనిపై రైడ్ చేయడం వల్ల అద్భుతమైన అనుభూతిని పొందుతారు.