TVS February 2026 Sales: ఆటోమోబైల్ రంగంలో తనకంటూ గుర్తింపు సాధించుకుంది TVS కంపెనీ. దీని నుంచి ఆకట్టుకునే టూ వీలర్స్ మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. బైక్స్ నుంచి స్కూటర్ల వరకు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మోడల్స్ రోడ్లపైకి వచ్చాయి. అయితే 2026 ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీ సేల్స్ 3 లక్షల యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన టూ వీలర్స్ లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ కంపెనీ 32.4% అభివృద్ధితో ముందుకు వెళ్తోంది. ఇంతకీ ఈ కంపెనీకి చెందిన బైక్స్, స్కూటర్లు ఎలాంటి అమ్మకాలు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..
2026 ఫిబ్రవరి నెలలో టీవీఎస్ కంపెనీకి చెందిన టూ వీలర్ Jupiter 1,27,089 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ వెహికల్ 1,03,576 సేల్స్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22.7% వృద్ధిని సూచిస్తుంది. అలాగే అపాచీ బైక్ 45,166 యూనిట్ల సేల్స్ అయ్యాయి. ఎక్స్ ఎల్ మోపెడ్ 45,095 వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇది 33,572 యూనిట్ల సేల్స్ ను నమోదు చేసుకుంది. దీంతో 34.3 శాతం వృద్ధి ని సూచిస్తుంది.
బైకులు మాత్రమే కాకుండా స్కూటర్ల అమ్మకాల్లోనూ ఈ కంపెనీ ముందున్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫిబ్రవరి నెలలో 38,054 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. గత ఏడాది ఈ స్కూటర్ 23,581 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. నీతో గత ఏడాదితో పోలిస్తే 61.38 వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. ఇదే కంపెనీకి చెందిన రైడర్ 36,134 యూనిట్లు అమ్మగా.. టీవీఎస్ N Tork స్కూటర్ 31,955 విక్రయాలు జరిపింది. ఈ స్కూటర్ 52.22 శాతం మృతిని సాధించింది. ఇదే కంపెనీకి చెందిన రేడియన్ 13,472 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. వినియోగదారులు ఎక్కువగా లైక్ చేసే టీవీఎస్ స్పోర్ట్స్ ను ఫిబ్రవరి నెలలో 9,642 మంది కొనుగోలు చేశారు. అలాగే జస్ట్ స్కూటర్ 9,130 సేల్స్ జరిగాయి.
మొత్తంగా ఈ కంపెనీకి చెందిన బైక్స్ కంటే స్కూటర్లే ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 56.43% వృద్ధితో స్కూటర్ల అమ్మకాలతో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. కొన్ని స్కూటర్లు గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా సేల్స్ పెరగగా.. మరికొన్ని స్కూటర్లు స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అయితే మోటార్ సైకిల్ 31.23% వాటాను కలిగి ఉంది. బైక్స్ విభాగంలో ప్రీమియం వాటికే ఎక్కువగా ప్రాధన్ అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఎక్స్ఎల్ మోపెడు పై కూడా ఆదరణ పెరుగుతోంది.