
కొత్తగా బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు టీవీఎస్ మోటార్ కంపెనీ తీపికబురు అందించింది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఆఫర్ ను టీవీఎస్ కంపెనీ బైక్, స్కూటర్ కొనుగోలు చేసేవాళ్లకు అందిస్తోంది. ఎంపిక చేసిన బైక్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టీవీఎస్ తీసుకున్న నిర్ణయం వల్ల బైక్, స్కూటర్ ను కొనుగోలు చేసేవాళ్లకు భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, 200 4వీ బైక్స్ ను కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం ఉంది. జులై 15వ తేదీలోపు బైక్స్ ను కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రమే ఈ ఆఫర్ ద్వారా బైక్ ను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రూ.5 వేలు డౌన్ పేమెంట్‌తో అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ బైక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
స్కూటీ పెప్ట్, జెస్ట్ స్కూటర్లకు సైతం టీవీఎస్ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ వర్తిస్తుందని సమాచారం. షోరూమ్ ప్రాతిపదికన ఆఫర్ల విషయంలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సమీపంలోని టీవీఎస్ షోరూమ్ కు వెళ్లడం ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆర్‌టీఆర్ 160 4వీ బైక్ స్టైలిష్ లుకింగ్ ను కలిగి ఉంటుంది.
ఇతర బైక్స్ లో లేని ఎన్నో ప్రత్యేకతలు ఈ బైక్ లో ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌లైట్, ట్విన్ డీఆర్ఎల్ అప్‌ప్రంట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఏబీఎస్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ బైక్ లో ఉండటం గమనార్హం.