Triumph Scrambler 400 X : కొండకోనలు ఎక్కాలన్నా, ప్రకృతి అందాలు చూడాలన్నా చాలా మందికి గుర్తొచ్చేది రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైక్. సాహస యాత్రలకు ఇది ఒక నమ్మకమైన నేస్తంగా పేరు తెచ్చుకుంది. అయితే, ఇప్పుడు ఈ బైక్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ట్రయంఫ్ కంపెనీ సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అనేక లేటెస్ట్ ఫీచర్లతో కేవలం రూ. 2.94 లక్షలకే అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త బైక్ పేరు ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ (Triumph Scrambler 400 XC). ఇదివరకే మార్కెట్‌లో ఉన్న ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ (Triumph Scrambler 400 X) యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ ఇది. అందుకే దీని ధర దానికంటే సుమారు రూ. 27,000 ఎక్కువ.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ ప్రత్యేకతలు
ఈ బైక్‌లో ట్రయంఫ్ కంపెనీ అనేక ఫీచర్లను, టూల్స్ స్టాండర్డ్‌గా అందిస్తోంది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ 398సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 40 పీఎస్ పవర్‌ను, 37.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సేఫ్టీ, ఎలాంటి రోడ్లైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఈ బైక్‌లో రైడ్-బై-వైర్ థ్రాటల్ టెక్నాలజీ, స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్-రోడ్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read : 2023లో రాబోయే టాప్10 బైక్ లు.. తప్పక కొనాలి అనిపించే వాటి ఫీచర్లు
ఇవే కాకుండా, ఈ బైక్‌లో ఆల్-ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. టార్క్ అసిస్టెడ్ క్లచ్, బ్రేక్ లివర్స్ వంటివి రైడింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
5 సంవత్సరాల వారంటీ
ఈ బైక్‌లో కంపెనీ క్రాస్ స్పోక్ వీల్స్‌ను అందించింది. ఆఫ్-రోడ్ కెపాసిటీ దృష్టిలో ఉంచుకుని ముందు 19 ఇంచుల వీల్, వెనుక 17 ఇంచుల వీల్‌ను అమర్చారు. ఈ బైక్‌ను స్టాండర్డ్‌గా 5 సంవత్సరాల వారంటీతో విడుదల చేశారు. కావాలనుకుంటే ఈ వారంటీని 10 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.