Google Pay : గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ పే.. ఇక ఆ సేవలు ఈజీ..

కాగా రెండు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో ఉపయోగడపుతుందని NPCL సీఈవో రితేష్ శుక్లా తెలిపారు.

Written By: Chai Muchhata, Updated On : January 18, 2024 8:28 pm
Follow us on

Google Pay : ప్రపంచమంతా డిజిటల్ మయంగా మారుతోంది. చేతిలో మొబైల్ ఉంటే ఏ పనైనా సులువు అవుతోంది. ముఖ్యంగా మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో మొబైల్ ఎంతో ఉపయోగపడుతోంది. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా.. బిల్లులు చెల్లించాలన్నా గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించారు. దేశంలో ఎక్కడున్నా జీ పే ద్వారా చెల్లించేవారు. అయితే విదేశాల్లో కూడా డిజిటల్ పే అవకాశాన్ని కల్పించారు. దీంతో విదేశాలకు వెళ్లేవారు డబ్బు తీసుకెళ్లకుండా గూగుల్ పే ద్వారా చెల్లించొచ్చు. అందుకు కారణం ఏంటంటే?

ప్రముఖ డిజిటల్ యాప్ గూగూల్ పే తాజాగా ‘నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ చెందిన ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్(NPCL) తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయులు విదేశాలకు వెళ్లాలంటే చేతిలో నగదు తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ అవకాశం లేకపోవడంతో డబ్బును చేతిలో తీసుకెళ్లేవారు. దీంతో గేట్ వే ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు గూగుల్ పే విదేశాల్లో కూడా ఆన్ లైన్ చెల్లింపుకు అవకాశం ఇవ్వడంతో దీని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ అవకాశం అందరికీ కాకుండా వినియోగదారులను బట్టి మాత్రమే అవకాశం ఇస్తుంది. ఈ ఛాన్స్ పొందిన వాళ్లు విదేశాల్లోని కరెన్సీ కోసం ఫారెక్స్ కార్డులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫారెక్స్ కార్డు అంటే విదేశాలకు వెళ్లినప్పుడు డబ్బు తీసుకెళ్లాల్సి వస్తే ముందుగా ఈ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని డెబిట్, క్రెడిట్ కార్డులాగా ఉపయోగిస్తారు. వీటిని బ్యాంకులో దరఖాస్తు చేసుకుంటే ఇస్తారు. వీటి ద్వారా ట్రైన్, విమానం టికెట్ల నుంచి విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు డబ్బులు చెల్లించడానికి ఉపయోగపడుతుంది.

తాజాగా గూగుల్ పే విదేశాల్లో ఆన్ లైన్ చెల్లింపులకు ఆస్కారం ఇవ్వడంతో ఈ ఫారెక్స్ కార్డులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికే కోట్ల మంది వినియోగిస్తున్న జీ పే తో ఎన్నో రకాల చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లో కూడా ట్రాన్జాక్సన్ ను సులభతరం చేయడం పలువురికి ఉపయోగపడనుంది. కాగా రెండు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో ఉపయోగడపుతుందని NPCL సీఈవో రితేష్ శుక్లా తెలిపారు.