టయోటా అనగానే ఇన్నోవా కారు గుర్తుకు వస్తోంది. ఈ కారు ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మరికొన్ని మోడళ్లను టయోటా కంపెనీ తీసుకొచ్చింది. తాజాగా టయోటా అర్బన్ క్రూయిజర్ ను ఏప్రిల్ 3న లాంచ్ చేసింది. దీని గురించి ఇప్పటికే ఆన్ లైన్ లో చర్చ సాగింది. ఎస్ యూవీ విభాగాంలో ఉన్న ఈ మోడల్ మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఆధారంగా ఉత్పత్తి చేయబడింది. వినియోగదారులను ఆశ్చర్యపరిచే ఫీచర్లతో.. ఊహించని ధరతో వచ్చిన దీని గురించి వివరాల్లోకి వెళితే..
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ నుంచి రిలీజ్ అయిన అర్బన్ క్రూయిజర్ లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో మొదటిది 89 బీహెచ్ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండో ఇంజిన్ 99 బీహెచ్ పీ, 148 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. వీటితో పాటు 5 ట్రాన్స్ మిషన్ , 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ లు ఉన్నాయి. సీఎన్ సీ పవర్ ట్రెయిన్ కూడా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ట్విన్ పాడ్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయెల్ టోన్ కలర్ ట్రీట్ మెంట్ తో క్యాబిన్ ఉంది. హెడ్ ఆప్ డిస్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, డీఆర్ఎల్ తో కూడిన ఆటోమేటిక్ ఎల్ ఈడీ లైట్స్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఫుష్ బటన్ స్టార్ట్ వంటి అధునాతన ఫీచర్లు కలిగి ఉంది. సేప్టీ విషయంలోనూ టయోటా ఏమాత్రం తగ్గలేదనే చెప్పొచ్చు. ఇందులో 360 డిగ్రీ కెమెరా ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి.
దీని గురించి ఇప్పటికే ఆన్ లైన్ లో రకరకాలుగా చర్చలు పెట్టారు. ధరపై కూడా నిపుణులు అంచనా వేశారు. వారికి అనుగుణంగానే రూ.7.73 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకీతో కలిసి మారుతి ఫ్రాంక్స్ కారుకు రీ బ్యాడ్జ్ వెర్షన్ గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టయోటా నుంచి ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ వంటి ఎస్ యూవీలు ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు అర్బన్ క్రూయిజర్ కూడా ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.