Toyota: సొంత అవసరాలతో పాటు టూర్లకు వెళ్లడానికి నేటి కాలంలో సొంత వెహికల్ ను కలిగి ఉంటున్నారు. ఇందులో భాగంగా కారు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కటుుంబ అవసరాలతో పాటు కార్యాలయాల పనుల నిమిత్తం ఉపయోగపడే వివిధ మోడళ్లను కంపెనీలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిల్లో SUVలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్లు కేవలం సొంత అవసరాలు తీర్చడమే కాకుండా లాంగ్ టూర్ వెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతాయి. విశాలమైన స్పేస్ తో పాటు ఇంజిన్ పవర్ కూడా ఎక్కువగా ఉండడం వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ఓ కంపెనీ కొత్త ఏడాదిలో మూడు SUVలను అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
దేశీయ మార్కెట్లో టయోటా కార్ల కంపెనీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన రూమియన్, ఇన్నోవా, ఫార్చ్యునర్ మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ కంపెనీ ఎక్కువగా SUVల ఉత్పత్తిపై ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే టయోటా నుంచి రిలీజ్ అయిన ఇన్నోవా నెంబర్ వన్ గా నిలిచింది. ఈ తరుణంలో ఎస్ యూవీలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మరికొన్ని నెలల్లో మూడు SUVలను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
టయోటా కరోలా క్రాస్ పేరుతో త్వరలో మార్కెట్లోకి కొత్త కారు రాబోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇన్నోవాతో పోటీపడే అవకాశం ఉంది. ఇందులో కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు TNGA-C ప్లాట్ ఫారంపై విక్రయించనున్నారు. ఇది15 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలైజ్ ఇస్తుంది. ఇందులో 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ , 2 ఎలక్ట్రిక్ మోటార్ లతో కలిపి హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంటుంది. ఇది 2025 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టయోటా కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే మరో మోడల్ హైరిడర్. ఇప్పటికే ఉన్న హైరిడర్ లో ఆటో డిమ్మింగ్ ఇన్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఆటో ఏసీ, ఆపిల్ కార్ ప్లేతో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే దీనిని 2025లో అప్ గ్రేడ్ చేస్తూ విడుదల చేయనున్నారు. ఇందులో కొత్త ఫీచర్లను అమరుస్తూ ఆకట్టుకునే డిజైన్ న తయారు చేయనున్నారు. ఇదే కంపెనీ నుంచి ఇండియా ఫ్యూచర్ అనే మరో ఎస్ యూవీని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిని మారుతి సుజుకీతో కలిసి అభివృద్ధి చేయనున్నారు.