Toyota Rumion MPV: కారు కొనాలనుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కంపెనీలు సైతం ఆకట్టుకునే మోడళ్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో టయోటా ఆటోమోబైల్ రంగంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇన్నోవా కారు ప్రియుల మనసును దోచేసింది. అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోయిన మోడల్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే కంపెనీ నుంచి మరో మోడల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికేమార్కెట్లోకి వచ్చిన ఈ కారు తక్కువ ధరతో పాటు మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. మరి ఆ గురించి తెలుసుకోవాలని ఉందా?
లేటేస్ట్ డిజైన్ తోపాటు ఇన్నోవా ఎంపీవీని బలోపేతం చేయడానికి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది రూమియన్ ఎంపీవి. ఇన్నోవా క్రిస్టా తరహాలోనే అధునాతంగా ఉన్న ఈ మోడల్ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్ ను కలిగి ఉంది. అలాగే క్రోమ్ ఇన్ సర్ట్ లతో డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. కొత్త గ్రిల్ తో పాటు ఎల్ ఈడీ టెయిల్ లైట్ తో ఉంటుంది. వివిధ కలర్లలో అందుబాటులో ఉన్న ఈ మోడల్ భద్రతా పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. ఐ కనెక్ట్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ సిస్టమ్ దీనిలో ఆకట్టుకుంటుంది.
రూమియన్ ఎంపీవి 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. అలాగే సీఎన్జీ వెర్షన్ లోనూ అందుబాటులో ఉంది. పెట్రోల్ విభాగంలో 6000 ఆర్పీఎం వద్ద 101 బీహెచ్ పీ పవర్, 4400 ఆర్ పీఎం వద్ద 136.8 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లోకి వెళ్తే.. 5500 ఆర్పీఎం వద్ద 86.63 బీహెచ్ పీ పవర్, 4200 ఆర్పీఎం వద్ద 121.5 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా రూమియన్ మోడల్ ప్రారంభ ధర రూ.10.29 లక్షలు కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ రూ.13.68 లక్షలతో విక్రయిస్తున్నారు.
సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమైన ఈ కారు ఇప్పటికే వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మారుతి సుజుకీ ఎర్టిగాకు ప్రత్యామ్నాంగా దీనిని చూస్తున్నారు. ఎర్టీగా కంటే మెరుగైన ఫీచర్లు ఇందులో ఉండడంతో రూమినియా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ప్రధానంగా 7 సీటర్ లేఅవుట్ ను కలిగి ఉంటుంది. డ్యాష్ బోర్డు విభిన్నంగా ఉంటుంది. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.