Toyota Grand Highlander 2026: నేటి కాలంలో కార్లు కొనాలని అనుకునేవారు ఎక్కువగా SUV వైఫై చూస్తున్నారు. ఇవి విశాలంగా ఉండడంతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ప్రీమియం ధర కూడా ఉండడంతో కొందరు లగ్జరీ కాళ్లు కొనాలని అనుకునేవారు వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కొన్ని కంపెనీలు సైతం లగ్జరీ కార్లు కొనే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసే వీటిని మార్కెట్లోకి ప్రవేశ పెడుతుంటాయి. ఇలాంటి కంపెనీల్లో TOYOTA ఒకటి. ఈ కంపెనీ నుంచి త్వరలో రాబోతున్న Grand Highlander 2026 first look ను రిలీజ్ చేసింది. ఉమ్మడి కుటుంబాలతోపాటు కొందరు ఉన్నత వర్గానికి చెందిన వారికి ఈ కారు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
చాలామంది పలుసార్లు దూర ప్రయాణం చేసేవారు.. విశాలమైన కారు ఉండాలని కోరుకునే వారికి టయోటా హైలాండర్ SUV కారు బాగా నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఎందుకంటే దీని ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా బోల్డ్ గా కనిపించే విధంగా ఉంది. LED లైటింగ్ సిస్టం డైనమిక్ లుక్ ను అందిస్తుంది. దీనిలో ఉండే పెద్ద క్రోమ్ గ్రిల్, మస్క్యులర్ వీల్ ఆర్చ్ లు ప్రీమియం టచ్ ను అందిస్తుంది. బాక్సీ బాడీతో ఉన్న ఈ కారులో హైవేపై ప్రయాణం చేస్తే స్వర్గంలో వెళ్లినట్లు అనిపిస్తుంది. దీనిపై ఉండే విశాలమైన పైకప్పు, పనోరమిక్ రూఫ్ కొత్త తరహా కార్ వలే అనిపిస్తుంది. దీని వెనుక ఉండే సీట్లు విస్తారంగా ఉండటంతో ఇందులో ప్రయాణించేవారు సౌకర్యమైన అనుభవాన్ని పొందుతారు.
ఈ కారు ఇంటీరియర్ లో స్మార్ట్ డిజైన్ ను అమర్చారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా 8 సీట్లు ఉండనున్నాయి. కాన్ఫిగరేషన్ ను బట్టి ప్రీమియం మెటీరియల్స్ ఉండనున్నాయి. సాఫ్ట్ టచ్ తో కూడిన డాష్ బోర్డు, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ప్రతి సీటింగ్ వరుసలో కనెక్టివిటీ కోసం యూఎస్బీ పోర్టు, స్వచ్ఛమైన వాతావరణం కోసం వెంటిలేషన్తో కూడిన విండోస్ హై ల్యాండర్ లో అద్భుతాన్ని అందిస్తుంది.