Toyota Baby Land Cruiser: మహీంద్రా నుంచి వచ్చిన థార్ ఎంతో మంది కార్ల వినియోగదారులను ఆకర్సించింది. ఈ మోడల్ మరొకటి రాదనుకున్నారు. కానీ ఆ తరువా మారుతి కంపెనీ జిమ్నీని తీసుకొచ్చింది. అయితే ఇది థార్ కు గట్టిపోటీ ఇవ్వకుండా ఆకర్షించే డిజైన్ తో కారు లవర్స్ దీని గురించి ఆలోచించారు. ఇప్పుడు ఇదే తరహాలో టయోటా కంపెనీ నుంచి మరో మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. జిమ్నికీ పోటీ ఇచ్చేందుకు రూపుదిద్దుకుంటోంది. ఈ కారుకు సంబంధించిన ఇమేజేస్ కొన్ని ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. దీని ఫీచర్స్ గురించి ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ మోడల్ ఎలా ఉంటుందంటే?
టయోటా కంపెనీ ఆకట్టుకునే కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులకు చేరువైంది. ఈ కంపెనీ నుంచి ఇన్నోవా, పంచ్ లాంటి వి సక్సెస్ అయ్యాయి. ఎక్కవగా SUVలకు ప్రిఫరెన్స్ ఇచ్చే ఈ కంపెనీ లేటేస్టుగా జిమ్నీ తరహాలో ఓ మోడల్ ను తయారు చేస్తోంది. దీనికి టయోటా బేబీ ల్యాండ్ క్యూయిజర్ అని పేరు పెట్టారు. కొన్ని నెలల కిందట టయోటా కంపెనీ వారు ల్యాండ్ క్యూయిజర్, ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ల గురించి పరిచయం చేయబోతన్నట్లు ప్రకటించారు. తాజాతా బేబీ ల్యాండ్ క్రూయిజర్ ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
బేబీ ల్యాండ్ క్రూయిజర్ Electrical Vehicle (EV) తో పాటు Beyond Zero (BZ)తో కాన్సెప్టు లో వస్తుంది. ఇది ల్యాండ్ క్రూయిజర్ కు సంబంధించిన మినీ వెర్షన్ గా చెబుతున్నారు. అంతేకాకుండా జిమ్నీకి పోటీ ఇస్తుంది కాబట్టి దీనిని జిమ్ని కిల్లర్ గా పేర్కొంటున్నారు. అక్టోబర్ చివరి నాటికి జపాన్ లో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. భారత్ లో ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలు బయటపెట్టడంతో చాలా మంది వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.
ఇప్పుడంతా కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ లేదా ఫ్యూయెల్ వెహికిల్స్ సెపరేట్ గా తయారు చేస్తున్నారు. కానీ టయోటా మాత్రం హైబ్రిడ్ లెవల్లో పెట్రోల్, డీజీల్ తో పాటు పవర్ ట్రెయినర్ ను కూడా అందిస్తుంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఉంది. డీజిల్ 2.8 లీటర్ ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయినర్ కూడా ఉంది. ఈ వెహికిల్ 4.3 మీటర్ల పొడవు ఉండి థార్, జిమ్నీ కంటే ఎక్కువ స్పేస్ ను కలిగి ఉంటుంది.
వరల్డ్ లెవల్లో ల్యాండ్ హప్పర్ కు పోటీ జిమ్నీ మాత్రమే. కానీ ఇప్పుడు టయోటా బేబీ ల్యాండ్ క్రూయిజర్ కూడ ఆ లిస్టులో చేరుతుంది. ఎందుకంటే 2.8 లీటర్ డీజిల్ ఉన్న వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడుపోతుంటాయి. అంతేకాకుండా హైబ్రిడ్ ఫ్యూయెల్ ను కలిగిన వాటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అయితే భారత్ లో దీనిని ప్రవేశపెడితమే మాత్రం కచ్చితంగా థార్, జిమ్నీకి గట్టి పోటీ ఇస్తుందంటున్నారు.