Best Mobiles Under 15000: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్ చూస్తుంటాయి.. హాని కొందరు బడ్జెట్లోనే ఫోన్ కొనాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు తక్కువ ధరతో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించే మొబైల్స్ ను తీసుకొస్తుంటాయి. అయితే కన్జ్యూమర్స్ మాత్రం ఒక టార్గెట్ ను ఏర్పాటు చేసుకొని దానిలోపు మొబైల్ కొనాలని అనుకుంటారు. ప్రస్తుతం అన్ని ఫీచర్లు ఉండి అనుకూలంగా ఉండే మొబైల్ ధర.15,000 నుంచి.20,000 వరకు అందుబాటులో ఉంది. అయితే రూ.15,000 లోపు మార్కెట్లో ఉండే మొబైల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
2026 ఏప్రిల్ మార్కెట్ రెండు ప్రకారం రూ.15,000 లోపు 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ధర తక్కువ అయినప్పటికీ ఇందులో అధిక రిఫ్రెష్ వెయిట్ తో పాటు నాణ్యమైన డిస్ప్లే, మెరుగైన బ్యాటరీ వ్యవస్థను అందిస్తున్నాయి. ఇలాంటి వాటిలో టాప్ 5 మొబైల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
Moto G67 అనే మొబైల్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.13,000 నుంచి రూ.14,000 వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 7000 mAh బ్యాటరీని చేర్చారు. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో పాటు పటిష్టమైన కెమెరా వ్యవస్థ కూడా ఉంది. రోజువారి వినియోగదారులకు ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.
Technopova కంపెనీకి చెందిన 7 ప్రో మొబైల్ ధర రూ.14,999 గా ఉంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉండడంతో మొబైల్ వేగం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇందులో 8 జిబి రామ్, 64 మెగాపిక్సల్ తో కూడిన మెయిన్ కెమెరా ఉండనుంది. 6000 mAh బ్యాటరీ ఉండడంతోపాటు దీనికి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కోరుకునే వారికి ఈ మొబైల్ బాగా ఉపయోగపడుతుంది.
Vivo కంపెనీకి చెందిన T4 X 5G అనే మొబైల్ లో శక్తివంతమైన ప్రాసెసర్ ఉండనుంది. 8 జిబి రామ్ తో పాటు ఆకర్షణీయమైన డిస్ప్లే దీనిపై కనిపిస్తుంది. నాణ్యమైన కెమెరాతో ఏఐ తరహాలో ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఈ మొబైల్ ధర రూ.13,999 గా ఉంది.
Realme కంపెనీకి చెందిన P1 అనే మొబైల్ ధర రూ.14,999 తో విక్రయిస్తున్నారు. మొబైల్ వేగం ఎక్కువగా ఉండాలని కోరుకునే వారితోపాటు అత్యధిక రిఫ్రెష్ రేట్ తో ఉండే స్క్రీన్ కావాలని అనుకునే వారికి ఈ మొబైల్ యూస్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ కూడా ఉంది.
చివరగా infinix కంపెనీకి చెందిన Note 50 5G మొబైల్ ధర రూ.14,000 తో విక్రయిస్తున్నారు. ఇందులో AMOLED డిస్ప్లే ఉండగా.. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 గా ఉండడంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.