Nani Bloody Romeo Announcement Video: కేవలం ప్రీ రిలీజ్ కంటెంట్ తోనే ఆడియన్స్ కి మెంటలెక్కిపోయేలా చేయడం లో డైరెక్టర్ సుజిత్(Sujith) ని మించినోడు టాలీవుడ్ లో ఎవ్వరూ లేరు అనుకుంట. బహుశా రాజమౌళి కూడా ప్రమోషనల్ కంటెంట్ తో సుజిత్ రేంజ్ హైప్ ని తీసుకొని రాలేడేమో. ఓజీ(They Call Him OG) చిత్రానికి ఎలాంటి క్రేజ్ ని తీసుకొచ్చాడో మనమంతా చూశాము. కేవలం ఒకే ఒక్క గ్లింప్స్ వీడియో తో సినిమా హైప్ ని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లాడు. ఈ చిత్రానికి థియేట్రికల్ ట్రైలర్ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు వచ్చింది. అయినప్పటికీ కూడా రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ హైప్ తోనే ఆ సినిమాకు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చేశాయ్. ఇప్పుడు ఆయన నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో ‘బ్లడీ రోమియో'(Bloody Romeo) అనే చిత్రం చేస్తున్నాడు. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేశాడు డైరెక్టర్ సుజిత్.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఒక్క షాట్ కూడా తెరకెక్కించలేదు , మొత్తం యానిమేషన్ తోనే ఈ వీడియో ని క్రియేట్ చేసాడు. గ్యాంగ్ స్టర్ డెన్ అని ఒక బంగ్లా ఉండడం , అందులో నాని చెఫ్ గా పని చేస్తుండడం , లాస్ట్ లో బాంబు పెట్టి ఆ డెన్ ని లేపేయడం , స్టైల్ గా సిగరెట్ వెలిచుకుంటూ బయటకు రావడం , ఈ షాట్స్ అన్నిటిని యానిమేషన్ లో చూపిస్తేనే కుర్రాళ్లకు మెంటలెక్కిపోయేలా చేసాడు సుజిత్. ఈ గ్లింప్స్ వీడియో తో జెన్ Z ఆడియన్స్ ఎంజాయ్ చేసే సినిమా తీయాలంటే అది కేవలం సుజిత్ వల్లే సాధ్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమ్మర్ నుండి షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి అట.
అయితే ఒక డైరెక్టర్ గా సుజిత్ కి ఎలాంటి వంకలు పెట్టలేము . ఆయన టేకింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ రైటింగ్ లో మాత్రం చాలా వెనుకబడ్డాడు. ఓజీ చిత్రం లో యాక్షన్ బ్లాక్స్ వరకు తీసుకుంటే వేరే లెవెల్ లో ఉంటాయి . కానీ రైటింగ్ పరంగా చూస్తే సినిమాలో విషయమే ఉండదు. సెకండ్ హాఫ్ ఎంత వీక్ గా ఉన్నిందో మనమంతా చూసాము. ఎదో పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల , సినిమాకు విపరీతమైన హైప్ ఉండడం వల్ల ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆడేసింది కానీ , వేరే హీరో తీసుంటే ఫ్లాప్ అయ్యేది అని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం . కనీసం ‘బ్లడీ రోమియో’ తో అయినా సుజిత్ రైటింగ్ పరంగా కుమ్మేస్తాడని ఆశిద్దాం. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి బ్లడీ రోమియో టీజర్ ని మీరు కూడా చూసేయండి.
