https://oktelugu.com/

Gold Rate Today : దిగొస్తున్న పసిడి.. అక్టోబర్ 1న ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

బంగారంతో పాటువెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ బులిటెన్ మార్కెట్లో వచ్చిన మార్పులతో ధరలు దిగి వస్తున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2023 / 09:40 AM IST

    gold-price-bangaram-dhara

    Follow us on

    Gold Rate Today : బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్తే. గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 30 శనివారంతో పోలిస్తే అక్టోబర్ 1న గోల్డ్ ప్రైస్ డౌన్ ఫాల్ అయ్యాయి. బంగారంతో పాటువెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ బులిటెన్ మార్కెట్లో వచ్చిన మార్పులతో ధరలు దిగి వస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1న ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

    బులియన్ మార్కెట్ ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 పలుకుతోంది. 24 క్యారెట్ల పసిడికి రూ.58,200తో విక్రయిస్తున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.300 మేర తగ్గింది. వెండి సైతం రూ.1200 మేర తగ్గి ప్రస్తుతం రూ.73,500 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్లది రూ.58,350 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్లది రూ.58,200 గా ఉంది.

    సౌత్ రాష్ట్రాలైన చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,600 ఉండగా.. 24 క్యారెట్లది రూ.58,450 గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్లది రూ.58,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్లది రూ.58,200 గా ఉంది.

    బంగారంతో పాటువ వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.73,500 ఉండగా.. ముంబైలో రూ.73,500 గా విక్రయిస్తున్నారు. సౌత్ రాష్ట్రాలైన చెన్నైలో కిలో వెండి రూ.76,000 ఉండగా, బెంగుళూరులో రూ.73,500లో అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో వెండి ధర రూ.76,000ధర పలుకుతోంది.

    శనివారం బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్లది రూ.58,530 గా ఉంది. వెండి ధరలు రూ.74,700తో విక్రయించారు. వెండి ధరలు తగ్గుతూ పెరుగుతుండగా.. బంగారం ధరలు మాత్రం పడిపోతున్నాయి. ప్రస్తుతం పండుల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగినా ధరలు తగ్గుతుండంపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.