Flipkart Big Billion Days Sale 2024: ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ దసరాకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో బారీ ఆఫర్లతో వచ్చింది. ‘ఫ్లిప్ కార్ట్ ప్లస్’ సభ్యుల కోసం సెప్టెంబర్ 26 నుంచి అర్థరాత్రి నుంచే డీల్స్ ఓపెన్ లో ఉంచబోతోంది. నాన్ ప్లస్ మెంబర్లకు సెప్టెంబర్ 27న ఈ సేల్స్ కొనసాగించవచ్చు. ఈ ఈవెంట్ విస్తృత శ్రేణి ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ డీల్స్, ముఖ్యంగా ఐఫోన్లు, శామ్‌సంగ్, తదితర భారీ శ్రేణి ఫోన్లపై ఈ సారి సేల్ లో దృష్టి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ విడుదల తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. సాధారణంగా 128 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 నుంచి ప్రారంభమయ్యే ఐఫోన్ 15 ప్రో రూ. 89,999 తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని ఫ్లిప్ కార్ట్ టీజర్లు సూచిస్తున్నాయి. రూ. 1,34,900 ఉన్న ఆపిల్ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఈ సేల్ లో రూ. 1,00,000 లోపు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్ల వివరాలు పూర్తిగా వెల్లడించనప్పటికీ. వీటిపై భారీ డిస్కౌంట్లు ఆశించవచ్చని తెలుస్తుంది. ఇది యాపిల్ అభిమాలను అప్ డేట్ చేసేందుకు అనువైన సమయం. ఈ సేల్ లో శామ్ సంగ్ ఫోన్లు కూడా ప్రముఖంగా ఉండనున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అసలు ధర చాలా ఎక్కువ, కానీ రూ. 37,999 కు లభిస్తుంది. శామ్ సంగ్ లైనప్ లో గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ5 జీ, 50 ఎంపీ రియర్ కెమెరా, 8 కే వీడియో సామర్థ్యం, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో పాపులర్ ఫ్లాగ్ షిప్ ఫోన్. అసాధారణ విలువను అందించే ఈ ఫోన్ రూ. 30,000 దిగువకు సేల్ లో ఉంచబోతున్నారు.
అదనంగా, గెలాక్సీ ఏ, ఎం, ఎఫ్ సిరీస్ నుంచి శామ్‌సంగ్ మిడ్-రేంజ్ పరికరాలు గణనీయమైన డిస్కౌంట్లను పొందుతాయని భావిస్తున్నారు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను కోరుకునేవారికి మంచి అవకాశం.
ఆపిల్, శామ్‌సంగ్ తో పాటు వీవో, ఒప్పో, వన్ ప్లస్ వంటి ఇతర ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల డివైజ్ లపై కూడా వినియోగదారులు డీల్ ను ఆశించవచ్చు. నిర్దిష్ట డిస్కౌంట్లను ఇంకా వెల్లడించనప్పటికీ, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అన్ని కేటగిరీల్లో పోటీ ధరలను అందించనుంది.
ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కు సెప్టెంబర్ 26 నుంచి ముందస్తు యాక్సెస్ ప్రారంభం కానుండడంతో సెప్టెంబర్ 27న అందరికీ అందుబాటులోకి రాకముందే ఈ అద్భుతమైన ఆఫర్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు సిద్ధమవుతున్నారు.