Best Mid Size SUV: నేటి కాలంలో సామాన్యులు సైతం కారు కొనాలని అనుకుంటున్నారు. దీంతో కంపెనీలు వీరిని ఆకర్షించేందుకు మిడ్ సైజ్ ఎస్ యూవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇవి దాదాపు ఎస్ యూవీ ఫీచర్స్ నే కలిగి ఉండి.. ధర తక్కువగా ఉంటుంది. ఇప్పటికే మిడ్ సైజ్ ఎస్ యూవీల్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటాలు ఆకట్టుకున్నాయి. వీటికి పోటీగా మరో మోడల్ మార్కెట్లో ఆకట్టుకుంటోంది. ఆ కారు ఏదో తెలుసుకుందామా..
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా భారత మార్కెట్లో తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే వివిధ మోడళ్లతో కొనుగోలు దారులను ఇంప్రెస్ చేసింది.లేటేస్టుగా తక్కువ బడ్జెట్ లో ఎస్ యూవీ అనుభూతిని కలిగించే ఓ మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే ‘కియా సానెట్’. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్ యూవీ 300, టాటా నెక్సాన్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. హ్యుందాయ్ కూడా ఇదే తరహాలో ఉన్నా దీని ధర రూ.14 లక్షలు. దీంతో తక్కువ బడ్జెట్ ఉన్నవారు కొనలేరు.
అయితే కియా సానెట్ మాత్రం ఇదే తరహా కారును రూ.8 నుంచి రూ.9 లక్షలకు వస్తోంది. కియా సానెట్ ఇప్పటి వరకు ఉన్న సెల్టోస్ మాదిరిగానే ఆకర్షణీయమైన లుక్ లో ఉంటుంది. దీనిని 6 వేరియంట్లలో విక్రయిస్తున్నారు. వీటిలో HTE, HTK, HTK+, HTX, GTX+, GTX+ అనే వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 5 గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే వీలుంది. ఇందులో రెండు డ్యూయల్ -టోన్ సేడ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంపీరియల్ బ్లూ, స్కపార్క్లింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, తదితర కలర్లు అందుబాటులో ఉన్నాయి.
కియా సానెట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ యూనిట్ కలిగి ఉంది. ఇందులో గేర్ బాక్స్ లో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏసీ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.సింగిల్ పాన్ సన్ రూప్, వైర్ లెస్ ఫోన్ చార్జర్ వంటిని ఆకట్టుకుంటున్నాయి.