Gold Prices: బంగారం, వెండి కొనుగోలుకు ఇదే మంచి సమయం.. ఎందుకంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 23న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,050 గా ఉంది. జనవరి 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800తో విక్రయించారు.

Written By: Srinivas, Updated On : January 23, 2024 10:50 am

Gold Prices

Follow us on

Gold Prices: బంగారం ధరలు మరోసారి స్థిరంగా కొనసాగాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. అటు వెండి ధరలు సైతం స్థిరంగా ఉండడంతో కొనుగోలుకు ఇదే మంచి సమయం అని అంటున్నారు. అంతర్జాతీయంగా పసిడి ధరలు గోల్డ్ ఔన్స్ కు 2 డాలర్లు తగ్గి 2022 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ 22.13 గా నమోదైంది.

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 23న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,050 గా ఉంది. జనవరి 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800తో విక్రయించారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,050గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,050 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,600తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,800తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,500గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,500గా ఉంది. ముంబైలో రూ.75,500, చెన్నైలో రూ.77,000, బెంగుళూరులో 73,000, హైదరాబాద్ లో రూ.77,000తో విక్రయిస్తున్నారు.