Electric Scooters : కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్లాన్ వేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీరు సబ్సిడీ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. అంటే తక్కువ ధరకే స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులే అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించేవారు ఈ అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్లపై వచ్చే ఏడాది మార్చి వరకే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దేశంలో సబ్సిడీ ధరలో రూ.లక్ష లోపు రేటుకు లభిస్తున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ1..
ఇందులో 1.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రేంజ్ 85 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. చార్జింగ్ టైమ్ 4 గంటలు. ధర రూ.89 వేలు.
ఒకాయ ఫాస్ట్ ఎఫ్2ఎఫ్..
ఈ స్కూటర్ బాగుంది. ఇందులో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. దీని రేంజ్ 80 కిలోమీటర్లు. చార్జింగ్ టైమ్ 5 గంటలు పడుతుంది. దీని ధర రూ. 99 వేలు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు.
ఒకినావా ప్రైజ్ ప్రో..
ఈ స్కూటర్ కూడా సబ్సిడీకి అందుబాటులో ఉంది. దీని రేంజ్ 81 కిలోమీటర్లు. బ్యాటరీ చార్జింగ్‌కు 3 గంటలు టైమ్ పడుతుంది. దీని ధర రూ. 99,654. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 56 కిలోమీటర్లు.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్..
ఈ మోడల్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని రేటు రూ.85,190. దీని రేంజ్ 82 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. బ్యాటరీ చార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.
కోమకి ఫ్లోరా..
ఈ స్కూటర్ కూడా సబ్సిడీపై లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 24 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ కావడానికి 5 గంటలు పడుతుంది. దీని ధర రూ.79 వేలు. దీని రేంజ్ 80 నుంచి 100 కిలోమీటర్లు.
ఒడిసీ రేసర్ స్కూటర్..
ఇది అందుబాటు ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 70,500. బ్యాటరీ ఫుల్ కావడానికి 5 గంటలు పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ఈ స్కూటర్ రేంజ్ 70 కిలోమీటర్లు.
యాంపియర్ జీల్ ఈఎక్స్..
ఈ స్కూటర్ ధర రూ.96 వేలు. ఇందులో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 120 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ కావడానికి 5 గంటలు పడుతుంది.
ఐవూమి ఎస్1..
ఈ స్కూటర్ సబ్సిడీకి అందుబాటులో ఉంది. ఇందులో 4.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 220 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 57 కిలోమీటర్లు. 50 శాతం చార్జింగ్ ఎక్కడానికి 2 గంటలు పడుతుంది. దీని ధర రూ. 69,999.