https://oktelugu.com/

Car Warning Lights : కారు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి విషయాలు ఇవీ..

చాలా మంది డ్రైవర్లకు తక్కువ ఇంధన సూచిక తెలిసినా దాని గురించి పట్టించుకోరు. కారులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు ఈ సూచిక వెలుగుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2024 / 06:46 PM IST

    Car Warning Lights

    Follow us on

    Car Warning Lights : కారు అనేది ఇప్పుడు సామాన్యుడికి కూడా నిత్యావసరంగా మారింది. అందులో కూర్చున్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లే కారు.. ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత యజమానులదే. కారుకు సుస్తీ చేస్తే దాని ప్రభావం అందులో ప్రయాణించేవారిపై పడుతుంది. కారు పరిస్థితిని ముందే యజమానికి తెలియజేసేందుకు దాదాపు అన్ని కంపెనీలు డ్యాష్‌బోర్డు ఇండికేటర్స్‌ ఇస్తున్నాయి. వాటి ఆధారంగా కారుకు ఏ సమస్య ఉందనేది తెలుస్తుంది. వాటిని లైట్‌ తీసుకుంటే ప్రమాదం తప్పుదు.

    చెక్‌ ఇంజిన్‌ లైట్‌..
    ఇది పసుపు రంగు లైట్‌. ఇది ఇంజిన్‌ సమస్య గురించి హెచ్చరిస్తుంది. ఈ లైట్‌ వెలిగినప్పుడు తక్కువ చమురు ఒత్తిడి లేదా వేడెక్కడం వంటి ఇంజిన్‌ సమస్యల సంకేతాల కోసం ఇంజిన్‌ను వీలైనంత త్వరగా తనిఖీ చేయడం ఉత్తమం. గ్యాస్‌ క్యాప్‌ తెరిచి ఉన్నా, వదులుగా ఉన్నా పగుళ్లు ఏర్పడినా ఇంధనం ఆవిరైనప్పుడు ఉద్గార వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు ఈ లైట్‌ వెలుగుతుంది.

    ఇంజిన్‌ టెంపరేచర్‌ వార్నింగ్‌..
    కారు టెంపరేచర్‌ దాని పనితీరును మెరుగు పరుస్తుంది. అధిక ఉష్ణోగ్రత జనరేట్‌ అయితే డ్యాష్‌బోర్డులో థర్మమీటర్‌ గేజ్‌ లైటు వెలుగుతుంది. దీని అర్థం ఇంజిన్‌ వేడెక్కిందని అర్థం. ఇది తక్కువ శీతలీకరణ స్థాయిలు, శీతలీకరణ వ్యవస్థలో లీక్, సరిగా పనిచేయని థర్మోస్టాట్‌ లేదా రేడియేటర్‌లో లీక్‌ కారణంగా కూడా ఈలైటు వెలుగుతుంది. దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడానికి డ్రైవ్‌కు వెళ్లేముందు వాటిని చల్లచబర్చాలి.

    ఆయిల్‌ ప్రెజర్‌ వార్నింగ్‌ లైట్‌..
    ఇంజిన్‌ ఆయిల్‌ అనేది ప్రతీ వాహనంలో ఓ కీలక భాగం. ఇది ఇంజిన్‌ను లూబ్రికేట్‌ చేస్తుంది. అధిక రాపిడిని నివారిస్తుంది. డ్యాష్‌బోర్డుపై ఆయిల్‌ ప్రెజర్‌ వార్నింగ్‌ లైట్‌ వెలిగిఏ కారు ఆయిల్‌ ప్రెజర్‌ పడిపోయిందని అర్థం. కారులో ఆయిల్‌ తగినంత లేదని సూచిస్తుంది. లైట్‌ వెలిగితే ఆయిల్‌ చెక్‌ చేసుకుని చేంజ్‌ చేసుకోవాలి.

    టైర్‌ ప్రెజర్‌ వార్నింగ్‌ లైట్‌..
    మెరుగైన ఇంధనం, టైర్‌ గ్రిప్‌ ఎక్కువ టైర్‌ లైఫ్‌ కోసం టైర్‌ను ప్రెజర్‌ లెవల్‌ ప్రకారం నిర్వహిచాలి. టైర్లలో ప్రెజర్‌ ఎక్కువ అయితే డ్యాష్‌బోర్డుపై టైర్‌ ప్రెజర్‌ వార్నింగ్‌ లైట్‌ వెలుగుతుంది. అప్పుడు ఎయిర్‌ ఫిల్లింగ్‌ పాయింట్‌కు వెళ్లి టైర్లలో గాలి చెక్‌ చేసుకోవాలి.

    యాంటి లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ లైట్‌..
    యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ అనేది ఒక భద్రత. ఇది హార్డ్‌ బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్‌ అవ్వకుడా ఆపివేస్తుంది. ఈ లైట్‌ వెలిగినప్పుడు డ్రైవింగ్‌ చేసేటప్పుడు గరిష్ట భద్రతను నిర్ధారించుకోవాలి. సమస్య ఉందని గుర్తించాలి.

    బ్రేక్‌ అలర్ట్‌ ఇండికేటర్‌..
    బ్రేకు అలర్ట్‌ ఇండికేటర్‌ను ఎప్పుడే నిర్లక్ష్యం చేయొద్దు. హ్యాండ్‌ బ్రేక్‌ ఎంగేజ్‌ అయినపుపడు మీ డ్యాష్‌బోర్డుపై ఈ లైట్‌ వెలుగుతుంది. అది బ్రేక్‌ సిస్టం సమస్య లేదా బ్రేక్‌ అలర్ట్‌ వార్నింగ్‌గా గుర్తించాలి. సమస్య పరిష్కారానికి మెకానిక్‌ను సంప్రనదించాలి.

    భద్రత ఇండికేటర్‌..
    ప్రయాణికుల భద్రతను నిర్ధాంచేందుకు డ్యాష్‌బోర్డుపై ఇండికేటర్‌ ఉంటుంది. ఏ కారు డ్రైవర్‌కైనా ఎయిర్‌ బ్యాగ్‌లు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. మీ ఎయిర్‌ బ్యాలలో సమస్య ఉన్నప్పుడు ఈ లైట్‌ వెలుగుతుంది.

    సీట్‌బెల్ట్‌ రిమైండర్‌..
    డ్యాష్‌బోర్డులో కనిపించే అత్యంత సాధారణ లైట్‌ ఇది. సీట్‌బెల్ట్‌ పెట్టుకోనప్పుడు ఇది ఇండికేషన్‌ ఇస్తుంది. సీటుబెల్ట్‌ పెట్టుకోవాలని సూచిస్తుంది. ఇండికేటర్‌ రాగానే సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలి.

    బ్యాటరీ వార్నింగ్‌ లైట్‌..
    కారుకు బ్యాటరీ కూడా చాలా ముఖ్యం. వాహనం బ్యాటరీ లేదా ఛార్జింగ్‌ సిస్టమ్‌లో సమస్య ఉంటే బ్యాటరీ వార్నింగ్‌ లైట్‌ డ్యాష్‌బోర్డుపై వెలుగుతుంది. దీనిని లైట్‌గా అస్సలు తీసుకోవద్దు. బ్యారటీ వదులుగా లేదా దెబ్బతిన్న బ్యాటరీ కేబుల్‌ లేదా విరిగిన అల్టర్టేర్‌ కూడా ఉన్నట్లు చూపుతుంది. కేబుల్‌ విరిగితే షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

    ఇంధన సూచిక..
    చాలా మంది డ్రైవర్లకు తక్కువ ఇంధన సూచిక తెలిసినా దాని గురించి పట్టించుకోరు. కారులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు ఈ సూచిక వెలుగుతుంది. రిజర్వు ఇంధనాలపై ఎక్కువసేపు డ్రైవింగ్‌ చేస్తే మీ ఇంధనం పంపుపై టోల్‌ పడుతుంది.