2024 Released Cars: ఇండియన్ ఆటోమోబైన్ సెక్టార్ 2024కు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఎస్‌యూవీలతో కార్ లవర్స్‌కు స్వాగతం చెప్పబోతున్నాయి. మూడు ఎస్‌యూవీల ఫేస్‌లిఫ్ట్ వర్షన్లను జనవరిలో లాంచ్ చేయబోతున్నాయి.
= మచ్ ఆవైటెడ్ కియా సోనెట్ ఫేస్లిష్ట్‌ను డిసెంబర్‌లోనే ఆవిష్కరించింది. రూ.25 వేల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. జనవరిలో కొత్త ఎస్‌యూవీని కూడా లాంచ్ చేయనుంది. మొత్తం ఏడు కొత్త వేరియంట్లలో ఈ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్ వర్షన్లు ఉన్నాయి. ధర వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
= హుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వర్షన్ కూడా 2024, జనవరిలో లాంచ్ చేయబోతోంది. జనవరి 16న జరగనున్న ఈవెంట్‌లో ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని హ్యుందాయ్ మోటార్స్ నిర్ణయిచింది. హ్యుందాయ్ క్రెటా డిజైన్ సరికొత్తగా, బోల్డ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైన్‌లో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ యాడ్ చేస్తారని సమాచారం.
= మెర్సిడెస్ జీఎల్‌ఎస్ కూడా జనవరిలో తన ఫేస్‌లిస్ట్‌ను లాంచ్ చేయబోతోంది. జనవరి 8న ఈ మోడల్ మార్కెట్‌లోకి విడుదల చేయాలని డిసైడ్ అయింది. కాస్మొటిక్స్ పరంగా ఈ ఎస్‌యూవీలో చాలా మార్పులు ఉంటాయని అంటున్నారు.