5 Star Safety Cars: కారు కొనేవారు ముందుగా చూసేది అధిక మైలేజీ. తర్వాత ధర. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ కార్లు కొనాలని భారతీయులు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు కాలం మారింది. సురక్షితమైన కార్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఆటో మొబైల్ కంపెనీలకు రక్షణ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొత్తకారు కొనేవారు ఇప్పుడు మైలేజీ, ధరతోపాటు సేఫ్టీని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత విషయంలో ఏడు కార్లు ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించాయి.
టాటా హారియర్/సఫారి..
టాటా హారియర్, టాటా సఫారి ఈ రెండూ సురక్షితమైన కార్ల జాబితాలో చేరాయి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రెండింటిలోనూ జీఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ఈ రెండు ఎస్‌యూవీలు సాధారణ భద్రతా ఫీచర్ల గురించి చెప్పాలంటే ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, చైల్డ్ సీట్ యాంకర్లు ప్రామాణికమైనవి. ఇది కాకుండా, హిల్ అసిస్ట్, 360–డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా వాటిలో అందుబాటులో ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ విర్టస్/ స్కోడా స్లేవియా..
వోక్స్‌వ్యాగన్ విర్టస్ ప్రారంభ ధర రూ.11.48 లక్షలు. అయితే, స్కోడా స్లావియా ప్రారంభ ధర రూ. 10.89 లక్షలుగా నిలిచింది. ఈ రెండు కార్లు కూడా భారతదేశంలోని సురక్షితమైన కార్లుగా గుర్తింపు పొందాయి. పెద్దలు, పిల్లల భద్రత కోసం 5–స్టార్ భద్రతా రేటింగ్ సాధించాయి. ఈ రెండు సెడాన్‌లు ఎంక్యూబీ ఏవో ఇన్ ప్లాట్‌ఫామపై ఆధారపడి ఉన్నాయి. వాటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు చూస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, 3–పాయింట్ సీట్‌బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ టైగన్/స్కోడా కుషాక్..
భారతదేశంలో వోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రారంభ ధర రూ. 11.62 లక్షలు. కాగా, స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు. ఈ రెండు కార్లు గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి పెద్దలు, పిల్లల భద్రత కోసం పూర్తి 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ కార్లు ఎంయ్యూబీ ఏవో ఇన్ ప్లాట్‌ఫాంలో కూడా నిర్మించారు. భద్రత కోసం, రెండింటిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబీడీ, ఏబీఎస్ 3–పాయింట్ సీట్‌బెల్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా..
హ్యుందాయ్ వెర్నా రూ.10.90 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది. ఈ కారు పిల్లలు, పెద్దల భద్రత కోసం పూర్తి 5–స్టార్ రేటింగ్‌తో కూడా వస్తుంది. కారు భద్రతా లక్షణాల గురించి మాట్లాడితే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ 3 పాయింట్ సీట్‌బెల్ట్, బ్లైండ్ స్పాట్ అలర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.