SUV Cars: జనవరినెలలో SUVల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు ఇవే..

టాటా కంపెనీకి చెంది ఈ కార్లు లేటేస్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. టాటా పంచ్ లో 7 అంగుళాల హర్మాన్ సోర్సడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ అన్ లాగ్, లెదర్ తో కూడిన ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.

Written By: Chai Muchhata, Updated On : March 1, 2024 7:33 pm

SUV Cars

Follow us on

SUV Cars: కాలం పెరుగుతున్న కొద్దీ కార్ల వినియోగం పెరిగిపోతున్నాయి. వీటిలో SUVలపై ప్రజలు మక్కువ పెంచుకుంటున్నారు. మిగతా కార్ల కంటే ఎస్ యూవీలు సౌకర్యవంతంగానూ.. బలమైన ఇంజిన్ ను కూడుకొని ఉండడంతో వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎస్ యూవీ కార్లను అందించడంలో టాటా కంపెనీ ముందంజలోకి వచ్చింది. ఇందులో భాగంగా 2024 జనవరి నెలలో ఈ కంపెనీ అత్యధికంగా ఎస్ యూవీ కార్లను విక్రయించింది. వీటిలో టాటా పంచ్ 17,978 యూనిట్లు అమ్ముడు పోగా.. టాటా నెక్సాన్ 17,182 యూనియట్లు విక్రయించింది. ఇంతకీ వీటిని ఎందుకు ఇష్టపడుతున్నారంటే?

టాటా కంపెనీకి చెంది ఈ కార్లు లేటేస్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. టాటా పంచ్ లో 7 అంగుళాల హర్మాన్ సోర్సడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ అన్ లాగ్, లెదర్ తో కూడిన ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ఇందులో బూట్ స్పేస్ 366 లీటర్లు ఉంటుంది. ఎస్ యూవీల్లో టాటా పంచ్ ఆకట్టుకోవడంతో ఈ కారును అత్యధికంగా ఇష్టపడ్డారు. అందువల్ల దీనిని గత నెలలో 17,978 మంది కొనుగోలు చేశారు.

టాటాకు చెందిన మరో కారు నెక్సాన్ కూడా పోటీ పడి విక్రయాలు జరుపుకుంది. పెట్రోల్, డీజీల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 17 నుంచి 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. 1199 నుంచి 1497 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. నెక్సాన్ ఎక్స్ షో రూం ధర రూ.8.15 లక్షల నుంచి రూ.14.80 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఈ కారును జనవరి నెలలో ఎక్కువగా ఆదరించారు. ఈనెలలో ఈ కారు 17,182 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది.