https://oktelugu.com/

Budget Cars : దేశంలో అతి తక్కువ ధరకు వచ్చే కార్లు ఇవే.. త్వరపడండి..

Budget Cars : నిన్నటి వరకు సామాన్యుడి తీరని కోరిక కారు కొనడం. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదోలా కారులో షికారు చేసేందుకు ఆ వాహనాన్ని దక్కించుకుంటున్నారు. అయితే ప్రపంచలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇటీవల కార్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మోటార్ రంగంలో వచ్చిన నిబంధనలు కారణంగా ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని కంపెనీలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మధ్యతరగతి పీపుల్స్ కు అందుబాటులో ఉండే విధంగా కార్లను డిజైన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 13, 2023 10:23 am
    Follow us on


    Budget Cars :
    నిన్నటి వరకు సామాన్యుడి తీరని కోరిక కారు కొనడం. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదోలా కారులో షికారు చేసేందుకు ఆ వాహనాన్ని దక్కించుకుంటున్నారు. అయితే ప్రపంచలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇటీవల కార్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మోటార్ రంగంలో వచ్చిన నిబంధనలు కారణంగా ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని కంపెనీలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మధ్యతరగతి పీపుల్స్ కు అందుబాటులో ఉండే విధంగా కార్లను డిజైన్ చేశారు. వారు కొనగలిగే ధరలతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటి గురించి ప్రచారం లేక చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. తెలిసిన వాళ్లు మాత్రం వాటిని సొంతం చేసుకోవడానికి బుక్ చేసుకుంటున్నారు.మరి దేశంలో లభ్యమ్యే ఆ అతితక్కువ ధరలు కలిగిన కార్లేవో చూద్దాం..

    మారుతి ఆల్టో K10:
    మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో K10 అత్యంత చవకైన కారు. పెట్రోల్ ఇంజిన్ తో కూడిన ఇందులో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెలట్్ ప్రిటెన్షనర్, సీట్ బెల్ట్ రిమైండర్, బెల్ట్ లోడ్ లిమిటర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఒక లీటర్ కెపాసిటీ గల K10 C Dualijet ఇంజన్ VVT ఇంజన్ ఇమిడి ఉంది. కంపెనీ CNG వేరియంట్ ను మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గుర్ బాక్స్ తో పరిచయం చేస్తుంది. ఈ కారును రూ.3.99 లక్షలకు సొంతం చేసుకోవచ్చు.

    మారుతి సెలెరియో:
    మారుతి నుంచి మరో కారు సెలెరియో కూడా తక్కువ బడ్జెట్ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఒక లీటర్ పెట్రోల్ ఇంజన్ సౌకర్యం ఉంది. లీటర్ కు 26 కిలోమీటర్ల కంటే ఎక్కువే మైలేజ్ ఇవ్వొచ్చంటున్నారు. CNG వేరియంట్ యొక్క మైలేజ్ లీటర్ కు 35.60 కిలో మీటర్లు. ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్ బాక్స్ కలిగి ఉంది. ఈ కారు రూ.5.35 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.

    టాటా టియాగో:
    టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఉత్పత్తి చేయబడిన ‘టియాగో’ 1200 సీసీ ఇంజన్ తో పనిచేస్తుంది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 20.09 కిలోమీటర్. CNG వేరియంట్ మైలేజీ 26.49 కిలో మీటర్లు.దీనిని ఎక్స్ -షో రూమ్ ధర రూ.5.54 లక్షలు. CNG ధర రూ.6.30 లక్షల నుంచి అమ్ముతున్నారు.

    హ్యుందాయ్ ఐ 10:
    హ్యుందాయ్ నుంచి మార్కెట్లోకి వచ్చి ఐ 10 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను ఉంటుంది. ఇది CNG మోడ్ లో 69 PS పవర్, 95.2 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. 8 ఇంచుల టచ్ స్క్రీన్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే సపోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిని రూ.5.69 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.