Cheapest Automatic Cars: ప్రపంచమంతా టెక్నాలజీతో నిండిపోతుంది. ప్రతీ పనిని సాంకేతికంతో చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమోబైల్ రంగంలోనూ టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారులకు అనుగుణంగా సౌకర్యాలు అందించేందుకు సాంకేతికంతో కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. తాజాగా ఓ కంపెనీ హ్యాచ్ బ్యాక్ కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింట్లోనే అవసరమైన విధంగా సాంకేతికాన్ని వాడుతోంది. ముఖ్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కు కూడా అమర్చింది. బెస్ట్ ఎక్విప్మెంట్ అందిస్తున్నా తక్కువ ధరకు లభించే ఆ కార్లు ఏవంటే?
మారుతి సుజుకీ కంపెనీ దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీగా పేరొందింది. ఈ క్రమంలో ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు అందుబాటలోకి తీసుకొచ్చింది. వీటిలో భాగంగా మారుతి ఆల్టో కే 10 వినియోగదారులను విపరీతంగ ఆకట్టుకుంటోంది. 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు 66 బీహెచ్ పీ పవర్, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు 24.90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ కారులో రివర్స్ పార్కింగ్ సెన్నార్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన ఏబీఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీని ప్రారంభ ధర రూ.5.91 గా ఉంది.
మారుతి నుంచి మరో బెస్ట్ మోడల్ సెలెరియో. ఈ మోడల్ 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ తో పనిచేస్తుంది. 66 బీహెచ్ పీ, 89 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్ పై 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో బెస్ట్ ఫీచర్స్ విషయానికొస్తే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇగ్నిషన్ స్టార్ట్ స్టాప్ బటన్ వంటిని ఆకర్షిస్తాయి. దీనిని రూ.6.38 లక్షల నుంచి రూ.7. 14 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మారుతి వాగ్యన్ ఆర్ గురించి కార్లు వాడేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అత్యధికంగా అమ్మకాలు జరిపిన కార్లలో ఇది నిలిచింది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 88 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. నావిగేషన్ సిస్టమ్, నాలుగు స్పీకర్ల తో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. హిల్ హోల్ట్ ఆసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రామ్, ట్విన్ ఎయిర్ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని రూ.6.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 67 బీహెచ్ పీ , 184 ఎన్ ఎం గ్రౌండ్ క్రలియరెన్స్ ను కలిగి ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, రెండు ఎయిర్ బ్యాగులు ఆకర్షిస్తాయి. ఈ కారును రూ.6.12 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.