Good Mileage Cars: కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ తర్వాత కారు మెయింటెనెన్స్ చేసే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా కార్లలో తిరగడం వల్ల ఎంత హాయిగా ఉంటుందో అందులో పోసే ఇంధనం ఖర్చుతో అంతే బాధపడుతూ ఉంటారు. సరైన ఆదాయం వస్తేనే కారులో తిరిగే ఏర్పాటు చేసుకోవాలని కొంతమంది చెబుతుంటారు. అయితే కొన్ని కంపెనీలకు చెందిన కార్లు తక్కువ బడ్జెట్ తో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. రోజువారి అవసరాలకు వినియోగించినా కూడా బడ్జెట్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కార్లు ఏమేమి ఉన్నాయి? అవి ఎలాంటి మైలేజ్ నీ అందిస్తున్నాయి? ఆ వివరాలు కి వెళ్తే..
మధ్యతరగతి ప్రజలు చాలావరకు కారు కొనే సమయంలో మైలేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలాంటి వారి కోసం అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుల గురించి చెప్పబోతున్నాం. వీటిలో Maruti Suzuki కంపెనీకి చెందిన Celerio కారు అత్యధిక మైలేజ్ ఇచ్చేదిగా నిలిచింది. ఈ కారు లీటర్ ఇంధనానికి 26 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. CNG వెర్షన్ లో 34.4 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనిని రూ.4.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దేశంలో టాప్ టెన్ కార్ల కంపెనీలో TATA ఒకటి. సేఫ్టీ విషయంలో ఈ కంపెనీకి చెందిన కార్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇదే సమయంలో మైలేజ్ ఇచ్చే కార్లు కూడా ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో Tiago ఒకటి. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 26.4 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీనిని రూ.4.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో కారు వ్యాగన్ఆర్ కూడా మైలేజ్ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కారు లీటర్ ఇంధనానికి 25.19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే కారు ఇదే. ఇందులో ఆకట్టుకునే, సౌకర్యవంతమైన ఫీచర్లు కూడా ఉండడంతో దీని అమ్మకాలు ప్రతి ఏడాది ఎక్కువే ఉంటాయి.
దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి ఆల్టో k10 కార్ కూడా మైలేజ్ విషయంలో ఏమాత్రం తీసిపోదు. ఈ కారు లీటర్ ఇంధనానికి 24.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని.3.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. చిన్న కుటుంబాలతోపాటు రోజువారి అవసరాలకు దేనిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు అప్డేట్ వెర్షన్లో మార్కెట్లోకి వచ్చింది.
Hyuundai కంపెనీకి చెందిన ఓ కారు కూడా మైలేజ్ విషయంలో ముందుంది. ఈ కంపెనీ నుంచి Grand i10 Neos అనే కారు లీటర్ ఇంతనానికి 18 కిలోమీటర్ల మైలేజ్ నీ అందిస్తుంది. CNG వెర్షన్లో 27 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.