Profitable Business Ideas: ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తుంది. ఈ సంవత్సరం పండుగల సీజన్‌లో చాలా పెద్ద పండుగలు అక్టోబర్‌లోనే వస్తున్నాయి. నవరాత్రి, దసరా, కర్వా చౌత్ తర్వాత ఇప్పుడు దీపావళి రాబోతోంది. దీని తర్వాత ఛత్ పూజ కూడా రాబోతోంది. ఈ సమయంలో భారతదేశం అంతటా ప్రజలు వివిధ వస్తువులను విస్తృతంగా కొనుగోలు చేస్తారు. బట్టలు, వాహనాలు, ఆభరణాలను జనాలు కొనుగోలు చేస్తుంటారు. దీంతో కోట్లాది రూపాయల వ్యాపారం కూడా జరుగుతుంది. మీరు కూడా ఈ కాలంలో ఏదైనా వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే, ఇది సరైన అవకాశం. ఈ రోజు మనం కొన్ని పండుగల సీజన్ వ్యాపార ఆలోచనల గురించి చెప్పుకుందాం, ఇది చాలా తక్కువ మూలధనం(పెట్టుబడి)తో ప్రారంభించుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో కూడా లాభాలకు పూర్తి స్కోప్ ఉంది. ఈ పార్ట్ టైమ్ వ్యాపారాల సహాయంతో మీరు పండుగను బాగా జరుపుకోవచ్చు. పండుగ జరుపుకుంటూనే ఆ తర్వాత కొంత డబ్బులను సంపాదించవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాంటి వ్యాపార ఆలోచనల గురించిన అన్ని వివరాలను తెలుసుకుందాం.
పూజా సామగ్రి
హవన్, పూజ సామగ్రికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అయితే పండుగల సమయంలో ఇంట్లో హవన, పూజ కార్యక్రమాలు పెరుగుతాయి. ఈ కాలంలో హవన, పూజ సామగ్రికి డిమాండ్ కూడా పెరుగుతుంది. వీటిలో అగరబత్తులు, ధూపం కర్రలు, దీపాలు, వత్తులు, హవాన్ పదార్థాలు ఉన్నాయి. కేవలం రూ.5 నుంచి 7 వేల స్వల్ప మొత్తంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ విషయాల్లో ఏ పెద్ద బ్రాండ్ జోక్యం పెద్దగా లేదు. అటువంటి పరిస్థితిలో, మీరు ఎటువంటి చింత లేకుండా మీ వ్యాపారాన్ని నిర్మించవచ్చు. దీనిలో నష్టాలకు ఛాన్సే ఉండదు. అంతే కాకుండా ఎవరైనా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.
మట్టి దీపాలు
దీపావళి రోజున ప్రతి ఇంట్లో మట్టి దీపాలను ఉంచుతారు. ఇది కాకుండా, గత కొన్నేళ్లుగా డిజైనర్ దీపాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇవి చాలా చౌకగా ఉంటాయి. దీపావళి వరకు పెద్దమొత్తంలో కొనుగోలు చేయబడతాయి. మీకు కావాలంటే, మీరు దీపం తయారీదారుని సంప్రదించవచ్చు. మీ సొంత ఆలోచనతో రూపొందించిన డిజైన్‌తో తయారు చేసిన దీపాలను పొందవచ్చు. అంతే కాకుండా ఇప్పుడు వాటిని కూడా యంత్రాలతో తయారు చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు.
విగ్రహాలు, కొవ్వొత్తులు
దీపావళి సందర్భంగా ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి, గణేశుడు, సంపదలకు కారకుడు అయిన కుబేరుడి విగ్రహాలను తీసుకొచ్చి పూజిస్తారు. అలాగే ఇల్లు మొత్తం వివిధ రకాల లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు ఈ విగ్రహాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది కాకుండా, డిజైనర్ క్యాండిల్స్, లైట్ల వ్యాపారం కూడా మీకు లాభాల పంట పండిస్తుంది. .