7 Seater Car: కారు కొనాలనుకునేవారు మొన్నటి వరకు చిన్న కారు ఉంటే సరిపోయేది అనుకున్నారు. దీంతో హ్యాచ్ బ్యాక్ కార్ల కోసం సెర్చ్ చేసేవారు. కానీ ఇప్పుడు విశాలమైన కారుతో పాటు ఇంజిన్ పవర్ ఎక్కువగా ఉండే 7 సీటర్ వెహికల్ కోసం ఆరాటపడుతున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో విశాలంగా ఉండడంతో ధర కాస్త కాస్ట్లీగానే ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాప్ పీపుల్స్ కు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసి సరసమైన ధరకే విక్రయిస్తున్నారు. అంటే కేవలం రూ.10 లక్షల లోపు ఈ కారును ఇంటికి తెచ్చుకోవచ్చంటున్నారు. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?
దేశీయ మార్కెట్లో మారుతి సుజుకీ నెంబర్ వన్ గా నిలస్తుంది. వినియోగదారుల అభిరుచులను బట్టి మోడళ్లను తయారు చేస్తుంది. ఈ తరుణంలో తక్కువ ధరకు 7 సీటర్ కారును అందించాలన్న ఉద్దేశంతో ఎర్టిగా(Ertiga)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 102 బీహెచ్ పీ పవర్, 136.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్, 6 స్పీడ్ టార్క్ కన్వర్ట్ తో పాటు ఆటోమేటిక్ గేర్ కూడా సౌకర్యంగా ఉంటుంది. దీనిని రూ.8.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.29 లక్షలతో విక్రయిస్తున్నారు.
మారుతి లాంటి కార్లతో పోటీ పడుతోంది రెనాల్ట్. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన డస్టర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ట్రైబర్ 7 సీటర్ ను కలిగి ఉంది. ఇది కాంపాక్ట్ ఎంపీవీగా ఉండి 5 స్ీపడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 71 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉతప్పతి చేసే ఈ కారు రూ.6.34 ప్రారంభ ధరతో ఉంది. SUV కార్లను కోరుకుంటున్న వారిలో మహీంద్రా కార్లను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఈ కంపెనీకి చెందిన బొలెరో నియో 1.5 లీటర్ డీజిల్ తో పాటు 99 బీహెచ్ పీ పవర్, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రూ.9.63 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకేసారి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అలాగే కొన్ని పనుల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల 7 సీటర్ కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి వారికి తక్కువ ధరలో 7 సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటే పై కార్లు సౌకర్యాంగా ఉంటాయి.